COVID-19: దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,408
దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా కేసుల సంఖ్య మొత్తం 4.49 కోట్ల (4,49,94,819)కు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.

Covid -19 cases
COVID-19 Infection: భారత్(India)లో కొత్తగా 54 కరోనా (Corona) కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇవాళ బులిటెన్ లో తెలిపింది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల 1,408గా ఉందని పేర్కొంది. కరోనా కారణంగా దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 5,31,914కి పెరిగినట్లు వివరించింది.
దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా కేసుల సంఖ్య మొత్తం 4.49 కోట్ల (4,49,94,819)కు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైనట్లు తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య 4,44,61,497గా ఉన్నట్లు పేర్కొంది.
మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను వినియోగించారు. దేశంలో కొన్ని నెలలుగా కరోనా కేసుల సంఖ్య అతి తక్కువగా నమోదవుతోంది.
Telangana Ayush Recruitment : తెలంగాణా ఆయుష్ విభాగంలో పలు పోస్టుల భర్తీ