India Covid : భారత్‌లో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..
24 గంటల్లో 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 13 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ మేరకు సోమవారం...

India Corona
India Records New Corona Cases : కరోనా మహమ్మారి నుంచి భారతదేశం కోలుకొంటోంది. గతంలో కన్నా తక్కువ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు… ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకున్నాయి. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. తాజాగా.. 24 గంటల్లో 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 13 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ మేరకు 2022, ఏప్రిల్ 04వ తేదీ సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Read More : Telangana Corona Case List : తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో 12,597 యాక్టివ్ కేసులున్నట్లు, దేశంలో 0.03 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 4,30,29,044 కేసులు నమోదయ్యాయని, 5,21,358 మరణాలు సంభవించాయని తెలిపింది. దేశంలో 98.76 శాతంగా కరోనా రికవరీ రేటుగా ఉందని, కరోనా నుంచి 24 గంటల్లో 1316 కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,95,089 చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.