భారత్‌లో 2.46 లక్షల కరోనా కేసులు.. 6,929కి చేరిన మరణాలు

  • Published By: vamsi ,Published On : June 7, 2020 / 04:39 AM IST
భారత్‌లో 2.46 లక్షల కరోనా కేసులు.. 6,929కి చేరిన మరణాలు

Updated On : June 7, 2020 / 4:39 AM IST

భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా విడుదలైన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 2.46 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 6,929 కు చేరుకుంది. భారతదేశం ఇప్పుడు కరోనా కేసుల విషయంలో ప్రపంచంలో ఐదవ స్థానంలో నిలిచింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో దేశంలో 9,971 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో దేశంలో 287 మంది రోగులు మరణించారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 2,46,628 కరోనా కేసులు ఉన్నాయి. వీటిలో 1,20,406మంది చికిత్స పొందుతూ ఉండగా.. 1,19,293 మందికి నయమైంది.

మహారాష్ట్రలో కరోనా కేసులు సంఖ్య ఏ మాత్రం తగ్గట్లేదు. తమిళనాడు కూడా కరోనా కేసుల విషయంలో రెండవస్థానంలో ఉంది. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యుల ఐదుగురు సభ్యుల అంచనా ప్రకారం, జూన్ చివరి నాటికి ఢిల్లీలో కనీసం లక్ష COVID-19 కేసులు వచ్చే అవకాశం ఉంది.