జులై 25 నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్

జులై 25,2020నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఓ రిపోర్ట్ లో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డ్రైవన్ డేటా ఎనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి, సింగపూర్ యూనివర్శిటీ తన నివేదికలో… మే-22నాటికి భారతదేశం 97 శాతం కరోనా వైరస్ కేసులను నిర్మూలిస్తుందని, జూన్ 1 నాటికి 99 శాతం, జూలై 25 నాటికి 100 శాతం కరోనాను నిర్మూలిస్తుందని తెలిపింది.
జులై 25నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్ నిలవనుందని తెలిపారు. కరోనావైరస్ ఒక వినాశనాన్ని సృష్టించిన… యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, యుకెతో సహా ప్రపంచం మరియు ఇతర దేశాలు కరోనావైరస్ నుండి ఎప్పుడు విముక్తి పొందుతాయో కూడా ఈ రిపోర్ట్ అంచనా వేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం…ఆగస్టు-27నాటికి కరోనా వైరస్ నుంచి అమెరికా విముక్తి పొందనుంది. డిసెంబర్ 9,2020నాటికి ప్రపంచం నుంచి కరోనా కనుమరుగైపోనుందని ఈ రిపోర్ట్ తెలిపింది. సింగపూర్ యూనివర్శిటీ రిపోర్ట్ ప్రకారం…ప్రపంచవ్యాప్తంగా మే-30నాటికి 97శాతం కరోనా కేసులు ముగుస్తాయని, జూన్-17నాటికి 99శాతం కేసులు,డిసెంబర్ లో 9,2020నాటికి 100శాతం కరోనా కేసులు ఆగిపోతాయని తెలిపింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఇటలీలో మే-8నాటికి 97శాతం కేసులు,మే-21నాటికి 99శాతం కేసులు,ఆగస్టు25నాటికి 100శాతం కేసులు ఆగిపోతాయని తెలిపింది. ప్రాన్స్ లో మే-6నాటికి 97శాతం కేసులు,మే-18నాటికి 99శాతం కేసులు, ఆగస్టు-5నాటికి 100శాతం కేసులు ఆగిపోతాయని ఈ రిపోర్ట్ అంచనావేసింది.