Ladakh : లడఖ్‌లో మళ్లీ హిమపాతం…సైనికుడి మృతి, నలుగురు గల్లంతు

జమ్మూకశ్మీరులో మరోసారి హిమపాతం సంభవించింది. లడఖ్‌లోని కున్ పర్వతం వద్ద హిమపాతం సంభవించడంతో భారత ఆర్మీ సైనికుడు మరణించాడు. మరో నలుగురు సైనికులు గల్లంతు అయ్యారు....

Ladakh : లడఖ్‌లో మళ్లీ హిమపాతం…సైనికుడి మృతి, నలుగురు గల్లంతు

Ladakh avalanche

Updated On : October 10, 2023 / 5:25 AM IST

Ladakh : జమ్మూకశ్మీరులో మరోసారి హిమపాతం సంభవించింది. లడఖ్‌లోని కున్ పర్వతం వద్ద హిమపాతం సంభవించడంతో భారత ఆర్మీ సైనికుడు మరణించాడు. మరో నలుగురు సైనికులు గల్లంతు అయ్యారు. హిమపాతం కారణంగా నలుగురు భారత ఆర్మీ సైనికులు మంచు కింద చిక్కుకుపోయి ఒకరు మృతి చెందారు. గల్లంతైన నలుగురు సైనికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత సైనికులు సాధారణ శిక్షణా కార్యకలాపాల సమయంలో హిమపాతం లడఖ్‌లోని మౌంట్ కున్‌ పర్వతాన్ని తాకింది.

Also Read : Tamil Nadu :బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 9 మంది మృతి

40 మంది సిబ్బంది హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్, ఇండియన్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్‌కు చెందిన సైనికులు మౌంట్ కున్ సమీపంలో సాధారణ శిక్షణా కార్యకలాపాలలో నిమగ్నమై ఉండగా హిమపాతం సంభవించిందని ఆర్మీ తెలిపింది. శిక్షణ సమయంలోనే నలుగురు సైనికులు మంచు కింద చిక్కుకుపోయారు. భారీ మంచు నిక్షేపాల కింద చిక్కుకున్న సైనికులను వెలికితీయడం కోసం రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది.