Gautam Adani: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. ఎందుకంటే?

గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సమా మరో ఏడుగురు 20ఏళ్లలో రెండు బిలియన్ డాలర్లు లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు

Gautam Adani: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు.. ఎందుకంటే?

Gautam Adani

Updated On : November 21, 2024 / 11:15 AM IST

Gautam Adani : భారతదేశ బిలియనీర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాలో నిధుల సేకరణ నిమిత్తం భారత అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు న్యూయార్క్ లో ఆయనపై కేసు నమోదైంది. అదానీ సహా ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత్ లో పోర్టులు, విమానాశ్రయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో అగ్రగామి పారిశ్రమికవేత్తగా గౌతమ్ అదానీ ఉన్నారు. రాబోయే 20 ఏళ్లలో రెండు బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించే ఓ కాంట్రాక్టు విషయంలో అవకతవకలు జరిగినట్లుగా సమాచారం. అయితే, ఈ విషయంపై అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది.

Also Read: PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం.. డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం

అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సమా మరో ఏడుగురు 20ఏళ్లలో రెండు బిలియన్ డాలర్లు లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ల డాలర్లు లంచాలు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి మూడు బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని అధికారులు అభియోగాలు మోపారు. ఇదిలాఉంటే.. గౌతమ్ అదానీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఛండీగడ్ ఎంపీ మనీష్ తివారీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘ఇప్పుడు ఈ విషయాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తు చేయాలి’ అని పేర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ‘మోదానీ’ స్కామ్స్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నామని, హమ్ అదానీ కె హై సిరీస్ లో ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలుసంధించామని, ఇంత వరకు సమాధానం రాలేదని పేర్కొన్నారు.

 

గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైందన్న వార్తల నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్ లో గందరగోళం ఏర్పడింది. గౌతమ్ అదానీకి చెందిన అన్నికంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఇదిలాఉంటే.. అదానీ గ్రూప్ కీలక ప్రకటన విడుదలైంది. తాజా పరిణామాల దృష్ట్యా.. మా అనుబంధ సంస్థలు ప్రస్తుతానికి ప్రతిపాదిత యూఎస్డీ డినామినేటెడ్ బాండ్ ఆఫర్లను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. ఇదిలాఉంటే.. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. అమెరికా నుంచి నేరారోపణల తరువాత అదానీ గ్రూప్ కంపెనీలు 600 మిలియన్ డాలర్ల బాండ్లను రద్దు చేశాయి.