Shivam Dubey Marriage : ప్రియురాలిని పెళ్లాడిన క్రికెటర్ శివమ్ దూబే..రెండు మతాల సంప్రదాయతో ఒక్కటైన జంట

భారత క్రికెట్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ప్రేమించిన యువతినే పెళ్లాడారు. ముంబై మోడల్ అజుమ్ ఖాన్ ను ప్రేమించిన శివమ్ దూబే ఓ ఇంటివాడయ్యాడు. వీరిద్దరి వివాహం కరోనా నిబంధనల అత్యంత నిరాడంబరంగా జరిగింది. కరోనా వల్ల అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు మధ్య ప్రేమికులిద్దరూ వివాహం బంధంతో ఒక్కటయ్యారు.

Shivam Dubey Marriage : ప్రియురాలిని పెళ్లాడిన క్రికెటర్ శివమ్ దూబే..రెండు మతాల సంప్రదాయతో ఒక్కటైన జంట

Shivam Dubey Azum Khan Marriage

Updated On : July 17, 2021 / 3:18 PM IST

Indian cricketer Shivam Dubey-Azum Khan Marriage : భారత క్రికెట్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ప్రేమించిన యువతినే పెళ్లాడారు. ముంబై మోడల్ అజుమ్ ఖాన్ ను ప్రేమించిన శివమ్ దూబే ఓ ఇంటివాడయ్యాడు. వీరిద్దరి వివాహం కరోనా నిబంధనల అత్యంత నిరాడంబరంగా జరిగింది. కరోనా వల్ల అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు మధ్య ప్రేమికులిద్దరూ వివాహం బంధంతో ఒక్కటయ్యారు.

ప్రేయసిని పెళ్లాడిన శివమ్ దూబే తన వివాహం ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.‘మేం ప్రేమ కంటే, ఎక్కువగా ప్రేమించుకున్నాం. ఇలా మా ఇద్దరి ప్రయాణం మొదలైంది… జస్ట్ మ్యారీడ్’ అంటూ పెళ్లి ఫోటోలను పోస్టు చేశాడు శివమ్ దూబే…

అజుమ్ ఖాన్ ముస్లిం యువతి, శివమ్ దూబే హిందూ యువకుడు.దీంతో వీరిద్దరూ ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ రెండు మతాల సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. కాగా..భారీ అంచనాలతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన 28 ఏళ్ల శివమ్ దూబే, ఐపీఎల్‌లోను, టీమిండియాలో కూడా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.

భారత జట్టు తరుపున 13 టీ20 మ్యాచులు ఆడి 105 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీశాడు.శివమ్ దూబే ప్రియురాలు..ఇప్పుడు భార్య అయిన ముంబైలో మోడలింగ్ చేసే అజుమ్ ఖాన్ తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది.