Indian Students: చివరి ఇండియన్ స్టూడెంట్ కదిలేవరకూ యుక్రెయిన్ వీడనంటోన్న ఇండియన్ డాక్టర్

యుక్రెయిన్ లో ఇరుక్కుపోయిన భారత స్టూడెంట్లను సేఫ్ చేసే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారత విద్యార్థుల పరిస్థితి దయనీయంగానే ఉంది.

Indian Students: చివరి ఇండియన్ స్టూడెంట్ కదిలేవరకూ యుక్రెయిన్ వీడనంటోన్న ఇండియన్ డాక్టర్

Prthwi Raj Ghosh

Updated On : March 5, 2022 / 7:36 PM IST

Indian Students: యుక్రెయిన్ లో ఇరుక్కుపోయిన భారత స్టూడెంట్లను సేఫ్ చేసే క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తుంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారత విద్యార్థుల పరిస్థితి దయనీయంగానే ఉంది. ఈ సమయంలో కోల్‌కతాకు చెందిన 37 సంవత్సరాల వయస్సున్న డాక్టర్.. అక్కడ చిక్కుకుపోయిన చివరి స్టూడెంట్ వెళ్లేంతవరకూ తాను ఇండియాకు రానని ఉండిపోయాడు.

‘నేను Kyivలో ఉండిపోయాను. నేను వెళ్లాలనుకోవడం లేదు. ఇప్పటికే 350మంది విద్యార్థులను యుక్రెయిన్ దాటించాను. వాళ్లంతా Kyivలో నా విద్యార్థులే. ఇతర కోఆర్డినేటర్లు కూడా పలు ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన విద్యార్థులను కాపాడమంటూ నన్ను అడుగుతున్నారు. ప్రత్యేకించి సుమీ విద్యార్థులు’ అని డా. ఘోష్ అన్నారు.

ఇంకా ఖార్కీవ్ ప్రాంతంలో 2వేల మంది వరకూ విద్యార్థులు ఉండిపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ విషయం విని భయపడుతూనే తాము గర్విస్తున్నామంటున్నారు అతని పేరెంట్స్. డాక్టర్ తల్లి అయిన బ్రతతీ రోజూ కొడుకుతో పాటు అతని విద్యార్థులు కూడా యుక్రెయిన్ నుంచి సేఫ్ గా రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అతని తండ్రి మాట్లాడుతూ ఆ విద్యార్థులందరికీ తన కొడుకు అన్నలాగా వ్యవహరిస్తున్నాడంటూ గర్వంగా చెప్పుకొచ్చారు.

 

Read Also : రష్యాతో మూడోసారి చర్చలకు యుక్రెయిన్‌ సిద్ధం.. ఈసారైనే ఫలిస్తాయా?