రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట.. ఇక నుంచి నో టెన్షన్.. టికెట్ రిజర్వేషన్ ఛార్ట్‌పై కీలక నిర్ణయం తీసుకున్న రైల్వేశాఖ

లు ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి కీలక నిర్ణయం తీసుకుంది.

రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట.. ఇక నుంచి నో టెన్షన్.. టికెట్ రిజర్వేషన్ ఛార్ట్‌పై కీలక నిర్ణయం తీసుకున్న రైల్వేశాఖ

Indian Railway

Updated On : June 30, 2025 / 7:51 AM IST

Railway reservation changes: రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణాల్లో అనిశ్చితి తొలగించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరడానికి 8గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం 4గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ప్రకటిస్తున్నారు.

ప్రయాణికుల సౌలభ్యంకోసం ఇకపై 8గంటల ముందే చార్జ్ విడుదల చేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా ప్రయాణం విషయంలో గందరగోళానికి తెరపడనుంది. మధ్యాహ్నం 2గంటల్లోపు బయలుదేరే రైళ్ల చార్ట్‌లను ముందురోజు రాత్రి 9గంటల కల్లా వెల్లడిస్తారు. దీనివల్ల వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులకు తమకు బెర్తులు ఖరారయ్యాయా..? లేదా..? అనే విషయంపై 8గంటల ముందే స్పష్టత రానుంది.

టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. టికెటింగ్ వ్యవస్థ పూర్తి పారదర్శకంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రిజర్వేషన్ చార్ట్ ను ప్రయాణానికి 8గంటల ముందు ప్రకటించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని దశల వారీగా అమల్లోకి తీసుకురానున్నారు.

మరోవైపు.. ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ (పీఆర్ఎస్)ను డిసెంబర్ నాటికి ఆధునికీకరించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం వ్యవస్థ ద్వారా నిమిషానికి 32వేల టికెట్లు బుక్ చేయడానికి అవకాశం ఉంది. అయితే, కొత్త విధానంలో నిమిషానికి 1.5లక్షల టికెట్లు బుక్ చేయడానికి వీలు కలగనుంది. అదేవిధంగా టికెట్ విచారణ వ్యవస్థ సామర్థ్యాన్ని నిమిషానికి నాలుగు లక్షల నుంచి 40లక్షలకు పెంచనున్నారు.

మరోవైపు.. జులై 1 నుంచి ఐఆర్సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ తో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ధృవీకరించిన యూజర్లు మాత్రమే అనుమతించబడతారు. జూలై నెలాఖరు నాటికి, తత్కాల్ బుకింగ్ ల కోసం ఆధార్ లేదా డిజిలాకర్ తో అనుసంధానమైన ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల ద్వారా ఓటీపీ ఆధారిత ధృవీకరణను తప్పనిసరి చేయనున్నారు.