రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రిటర్న్‌ జర్నీ టికెట్‌పై 20 శాతం రాయితీ

ఈ రిటర్న్‌ టికెట్‌ బుకింగ్‌కు 60 రోజుల ముందస్తు రిజర్వేషన్‌ పీరియడ్‌ రూల్ వర్తించదు.

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రిటర్న్‌ జర్నీ టికెట్‌పై 20 శాతం రాయితీ

Updated On : August 9, 2025 / 10:34 PM IST

సరిగ్గా పండుగల సమయంలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని దాన్ని నివారించడానికి ముందస్తు రిజర్వేషన్‌ను ప్రోత్సహిస్తోంది. దీని కింద అక్టోబర్ 13 నుంచి 26 తేదీల్లో చేసే ప్రయాణానికి, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 వరకు అదే రైలులో తిరిగి రావడానికి బుక్‌ చేసుకునే టికెట్లపై 20 శాతం రాయితీ ఇస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 14 నుంచి బుక్ చేసుకున్న టికెట్లపై ఉంటుంది. రాజధాని, శతాబ్ది, దూరంతో వంటి ఫ్లెక్సీ ఛార్జీల రైళ్లకు రిబేట్ వర్తించదు.

Also Read: రాహుల్‌ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై ఏపీలో చర్చ.. రాహుల్ వ్యాఖ్యలను వైరల్ చేస్తోన్న వైసీపీ సోషల్ మీడియా

రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి విడుదలైన ఒక పత్రికా ప్రకటన ప్రకారం.. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP – ముందస్తు రిజర్వేషన్ గడువు) తేదీ.. ఆగస్టు 14 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 13 – అక్టోబర్ 26 మధ్య ప్రారంభమయ్యే ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవాలి. ఆ తరువాత, కనెక్టింగ్ జర్నీ ఫీచర్ ఉపయోగించి నవంబర్ 17- డిసెంబర్ 1 మధ్య ప్రారంభమయ్యే తిరిగి వచ్చే ప్రయాణ టికెట్ బుక్ చేసుకోవాలి.

ఈ రిటర్న్‌ టికెట్‌ బుకింగ్‌కు 60 రోజుల ముందస్తు రిజర్వేషన్‌ పీరియడ్‌ రూల్ వర్తించదు. వెళ్లే, తిరిగి వచ్చే ప్రయాణానికి బుక్‌ చేసుకున్న టికెట్‌లు కన్ఫర్మ్‌ అయినప్పుడే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అలాగే రెండు టికెట్లు ఒకే క్లాస్‌కి చెందినవై ఉండాలి

“ఈ పథకం ప్రకారం, ప్రయాణికులకు వెళ్లే, తిరిగి వచ్చే రెండు ప్రయాణాలకు బుక్ చేసుకున్నప్పుడు రాయితీలు వర్తిస్తాయి” అని రైల్వే తెలిపింది. తిరిగి వచ్చే ప్రయాణ బేస్ ఛార్జీపై (సాధారణ ఛార్జీపై) 20 శాతం మొత్తం రాయితీ వస్తుంది.