Indian Railways : ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇవాళ్టి నుంచే అందుబాటులోకి..
Indian Railways ఇండిగో విమానాల రద్దుతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ
Indian Railways
Indian Railways : ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతూనే ఉంది. వందల సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం కూడా ఇండిగో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలను రద్దు చేశారు. అయితే, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇండిగో విమానాల రద్దుతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 114 అదనపు ట్రిప్పులను నడుపుతోంది. అంతేకాకుండా 37రైళ్లకు 116 అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. సబర్మతి – ఢిల్లీ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వేశాఖ ప్రకటించింది.
18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచినట్లు దక్షిణ రైల్వే తెలిపింది. అదేవిధంగా మూడు కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లను పెంచినట్లు తూర్పు రైల్వే శాఖ ప్రకటించింది. ఎనిమిది రైళ్లలో థర్డ్ ఏసీ, చైర్‌కార్ కోచ్‌లను పెంచినట్లు నార్తర్న్ రైల్వే తెలిపింది. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లను పెంచినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది. సెకండ్ ఏసీ కోచ్‌లను అదనంగా పెంచుతూ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. 10 రూట్లలో నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
Indian Railways, in view of the surge in passenger demand following widespread flight cancellations, has taken extensive measures to ensure smooth travel and adequate availability of accommodation across the network. A total of 37 trains have been augmented with 116 additional… pic.twitter.com/ovDFWqG0VR
— ANI (@ANI) December 5, 2025
