Brazil Plane Crash : టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం.. వీడియో వైరల్

Brazil Plane Crash : బ్రెజిల్ విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతుండగా ఓ విమానంలో మంటలు చెలరేగాయి.

Brazil Plane Crash : టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం.. వీడియో వైరల్

Brazil Plane Crash

Updated On : December 6, 2025 / 11:04 AM IST

Brazil Plane Crash : బ్రెజిల్ విమానాశ్రయంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతుండగా ఓ విమానంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకు దింపేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

బ్రెజిల్‌ దేశం సావో పాలో నగరంలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదం సమయంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. LATAM ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A320 విమానం టేకాఫ్ కోసం సిద్ధమవుతుండగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.

LATAM ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A320 విమానం రన్‌వే పైనే మంటలు చెలరేగాయి. విమానం టేకాఫ్ కు సిద్ధమవుతుండగా క్యాబిన్ లో ఒక్కసారిగా పొగతో నిండిపోయింది. ప్రయాణికులు కిటికీల ద్వారా మంటలను గమనించారు. అప్రమత్తమైన విమాన సిబ్బంది 180మంది ప్రయాణికులను అత్యవసరంగా కిందికి తరలించేందుకు చర్యలు చేపట్టారు.

ప్రయాణికులు మెట్లు, గాలితో కూడిన స్లయిడ్ ల ద్వారా విమానం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయం అధికారులు తెలిపారు. వెంటనే సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది.

విమానం ప్రమాదం సమయంలో అందులోని ప్రయాణికులు భయంతో కేకలు వేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.