ఇండియన్ రైల్వే సరికొత్త రికార్డు

Indian Railways ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే వ్యవస్థ ఒకటి. తాజాగా భారతీయ రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకంగా 295 వేగన్లతో ఐదు రైళ్లను అనుసంధానించి నడిపించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 5 రైళ్లను అనుసంధానించిన తరువాత ఈ రైలు పొడవు 3.5 కి.మీ. ఈ రైలుకు ‘వాసుకి’ అని భారతీయ రైల్వే పేరు పేట్టింది. ఈ సరుకు రవాణా వాసుకి రైలును ఛత్తీస్‌గడ్‌లోని భిలై నుంచి కోర్బా వరకు నడుపుతూ భారతీయ రైల్వే ఈ కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం సుమారు 224 కిలో మీటర్ల దూరం.
ఈ రైలుని ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్, ఒక గార్డు సహాయంతో నడిపారు. పారిశ్రామిక ఉత్పత్తులను అధికంగా మొత్తంలో పంపిణీ చేయడంతో పాటు సరుకు రవాణా రంగంలో కీలక మార్పులను ఈ రైలు తీసుకొచ్చిందని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా, గతంలో 177 వేగన్లతో మూడు గూడ్స్ రైళ్లను అనుసంధానించి నడిపారు. దీనికి ‘సూపర్ అనకొండ’ అనే పేరు పెట్టారు. బిలాస్ పూర్ నుంచి చక్రధర్ పూర్ డివిజన్ల మీదుగా ఈ అనకొండ గూడ్స్ రైలు సాగింది.
Longest hauling!
Recently, @secrail hauled 3.5 Km freight train, Vasuki, towing 295 wagons, from #Bhilai to #Korba#PhotoOfTheDay #freight #railways #India #IndianRailways #Chhattisgarh pic.twitter.com/WMKYdWy8G1— South Western Railway (@SWRRLY) January 23, 2021