Inida First AC Double Decker E-Bus : ముంబైలో దేశంలోనే మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ E-బస్ ప్రారంభం

భారతదేశంలో మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ ఈ-బస్సును సోమవారం ప్రారంభించింది బృహన్ ముంబై. ముంబయి నగరంలో ఈ డబుల్ డెక్కర్ ఈ-బస్సులు ఇక సందడి చేయనున్నాయి.

Inida First AC Double Decker E-Bus : ముంబైలో దేశంలోనే మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ E-బస్ ప్రారంభం

India First AC Double Decker E-Bus In Mumbai

Updated On : February 14, 2023 / 4:44 PM IST

First AC Double Decker E-Bus In Mumbai : పర్యావరణ హితం కోసం ఇకపై భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అనటానికి ఎన్నో ఈ-వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. కార్లు,బైకులు వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఈక్రమంలో భారతదేశంలో మొట్టమొదటి ఏసీ డబుల్ డెక్కర్ ఈ-బస్సును సోమవారం (ఫిబ్రవరి 13,2023) ప్రారంభించింది బృహన్ ముంబై. ముంబయి నగరంలో ఈ డబుల్ డెక్కర్ ఈ-బస్సులు ఇక సందడి చేయనున్నాయి. ఏసీ డబుల్ డెక్కర్ E Busను ముంబయి నగరంలో ప్రవేశపెట్టారు. ఇక వీటి సంఖ్య త్వరలో పెరగనుంది. 2023 చివరినాటికి వీటి సంఖ్యను పెంచాలని యోచిస్తోంది ముంబై పాలనా యంత్రాంగం.

కాగా ఈ ఏసీ డబుల్ డెక్కర్ ఈ-బస్సుల సేవలను ప్రయాణికులు పొందాలంటే మరో కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ముంబై నగరంలో ప్రజా రవాణా కోసం ప్రాంతీయ రవాణా ఏజెన్సీ ఎలక్ట్రిక్ బస్సు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అందుకని కాస్త సమయం పడుతుంది. కొత్త వాహనం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి రెండు నుండి మూడు రోజులు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. అన్ని అనుమతులు పొందాక మొదటిసారిగా ప్రారంభించిన ఈ ఏసీ డబుల్ డెక్కర్ E Bus కుర్లా బస్ డిపో, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య సేవలు అందించనుంది. టికెట్ల ధర గతంలో వలెనే ఉంటుందని 5కిలోమీటర్ల దూరానికి రూ.6లు ఉంటుంది.

2023 చివరినాటికి ఈ E Busల సంఖ్యనరు 200కి చేరేలా చర్యలు తీసుకుంటోంది బృహన్ ముంబై. దీంట్లో భాగంగా మరో 10 రోజుల్లోనే మరో ముండై రోడ్లుపైకి రానున్నాయి. కాగా దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సును ముంబయిలోని బెస్ట్ ఫ్లీట్‌లో చేర్చామని అధికారులు తెలిపారు. బస్ చార్జింగ్ 80 నిమిషాలు పడుతుందని అధికారులు తెలిపారు.

మొత్తం 20 బస్సులను నడుపనున్నట్లు బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) అండర్‌టేకింగ్ జనరల్ మేనేజర్ లోకేష్ చంద్ర తెలిపారు. కొత్త బస్సుల్లో డిజిటల్ టికెటింగ్, సీసీటీవీ కెమెరాలు, లైవ్ ట్రాకింగ్, డిజిటల్ డిస్‌ప్లే, అత్యవసర పరిస్థితుల కోసం పానిక్ బటన్ వంటి సదుపాయాలు ఉన్నాయి.ఈ బస్సుల ఛార్జీలు సింగిల్ డెక్కర్ ఏసీ బస్సులకు వర్తించే ఛార్జీలే ఉంటాయి. అంటే 5కిలోమీటర్ల దూరానికి రూ.6లు ఉంటుంది.