అలసిపోదు : దేశంలో మొదటి రోబో పోలీస్

కేరళలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి ఉన్నతాధికారులకు తెలియజేసే రోబోను కేరళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశపెట్టారు. ఇది పోలీసు పని కోసం రోబోట్ ను ఉపయోగించిన దేశంలో మొట్టమొదటి పోలీసు శాఖగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోలీస్ రోబోను ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పోలీస్ సర్వీసులోకి సీఎం విజయన్ హానరరీ సెల్యూట్‌తో స్వాగతం చెప్పగానే రోబో పర్‌ఫెక్ట్ సెల్యూట్ చేసింది. ప్రధాన కార్యాలయం ఫ్రంట్ ఆఫీసులో రోబో విధులు నిర్వర్తించనుంది.
కార్యాలయానికి వచ్చే సందర్శకులు, ఇతర అధికారులు,సిబ్బంది, ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరిస్తుంది. వారికి అవసరమైన వివరాలను తెలియజేస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. రోబోకాప్‌కు ఎస్సై ర్యాంకు కూడా కల్పించారు. (DGP) లోక్‌నాథ్ బెహ్ర మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలోకి టెక్నాలజీని చేర్చడమే తమ లక్ష్యమని వివరించారు. సాధారణ పోలీసుల తరహాలోనే రోబోకాప్ ఉన్నతాధికారులను గుర్తించి సెల్యూట్ చేస్తోంది.