India First Transgender OPD : ట్రాన్స్‌జెండర్ల కోసం మొట్టమొదటి OPD సేవలు .. ఎక్కడంటే?
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ OPD లో ప్రతి శుక్రవారం వీరికి ప్రత్యేక సేవలు అందించనున్నారు.

India First Transgender OPD
India First Transgender OPD : భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ OPD ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ శుక్లా ఈ ప్రత్యేక సేవలను ప్రారంభించారు.
ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోనే మొట్టమొదట ఈ సేవల్ని అందిస్తున్న ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. తొలి ట్రాన్స్‌జెండర్ ఔట్ పేషెంట్ డిపార్ట్ మెంట్‌ను మోదీ జన్మదినోత్సవం సందర్భంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఆసుపత్రి డైరెక్టర్ అజయ్ శుక్లా ఈ ప్రత్యేక సేవలను ప్రారంభించి వివరాలను వెల్లడించారు.
Elon Musk daughter: నేను ట్రాన్స్‌జెండర్‌ని.. ఈ విషయాన్ని నాన్నకు చెప్పకు: ఎలాన్ మస్క్ కూతురు
ప్రత్యేక OPD సేవలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ట్రాన్స్‌జెండర్స్‌కి అందుబాటులో ఉంటాయని.. అందుకోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ శుక్లా ప్రకటించారు. డిమాండ్‌ను బట్టి సేవల్ని మరికొన్ని రోజులకు విస్తరించేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంలో ఆయన వెల్లడించారు. రెగ్యులర్ OPD లను సందర్శించడానికి ట్రాన్స్‌జెండర్స్ సుముఖత చూపించకపోవడంతో వారి అవసరాలను గుర్తించి ఈ సాహసోపేతమైన అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఈ OPD లో ట్రాన్స్‌జెండర్లకు ప్లాస్టిక్ సర్జరీ, స్కిన్‌కి సంబంధించిన చికిత్స, యూరాలజీ జేవలు, పీడియాట్రిక్ కేర్, రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.