Vijayawada: అబ్బాయికి, అబ్బాయికి మధ్య ప్రేమ అని మా గురించి అంటున్నారు.. అది అబద్ధం: ట్రాన్స్ జెండర్ భ్రమరాంబ వివరణ
నాగేశ్వరరావు తల్లి కూడా.. ఆడపిల్లగా కనపడితే తనను కోడలిగా ఒప్పుకుంటానందని భ్రమరాంబ తెలిపారు.

Vijayawada
Vijayawada – Love Story : విజయవాడలో ఓ పురుషుడు అమ్మాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్నాడని, చివరకు ప్రేమికుడి చేతిలో మోసపోయాడని కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. నాగేశ్వరరావు, పవన్ అనే ఇద్దరు కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
పవన్ అవయవ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని భ్రమరాంబికగా మారిపోయారు. నాగేశ్వరరావు మోసం చేశాడని తాజాగా మీడియాకు ముందుకు వచ్చారు. దీనిపై భ్రమరాంబ ఇవాళ పూర్తి వివరాలు తెలిపారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని భ్రమరాంబ అన్నారు.
నాగేశ్వరరావుతో తనకు 2019 నుంచి పరిచయమని తెలిపారు. అబ్బాయికి, అబ్బాయికి మధ్య ప్రేమ పుట్టిందని కొందరు అంటున్నారని, అది అబద్ధమని చెప్పారు. తాను మొదటి నుంచీ ట్రాన్స్ జెండర్ నేనని అన్నారు. తాను అబ్బాయిని కాదని తెలిపారు. ట్రాన్స్ జెండర్ అని తెలిసే నాగేశ్వరరావు తనను ప్రేమించాడని చెప్పారు.
పూర్తిస్థాయిలో మహిళగా కనబడితేనే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని అన్నారు. తర్వాత తనను ఢిల్లీకి తీసుకెళ్లాడని తెలిపారు. అక్కడ తన రూ.11 లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించుకున్నానని భ్రమరాంబ అన్నారు. నాగేశ్వరరావు తల్లి కూడా ఆడపిల్లగా కనపడితే తనను కోడలిగా ఒప్పుకుంటానందని భ్రమరాంబ తెలిపారు.
ఆపరేషన్ కి ముందే నాగేశ్వరరావు తన దగ్గర డబ్బు, నగలు తీసుకున్నారని చెప్పారు. ఆపరేషన్ పూర్తయ్యాక తనను పెళ్లిచేసుకోనంటూ చిత్రహింసలు పెట్టాడని తెలిపారు. తన దగ్గర రూ.26 లక్షలు తీసుకుని మోసం చేసి పారిపోయాడని అన్నారు. చివరికి పోలీసులకి ఫిర్యాదు చేశానని తెలిపారు.
Vijayawada : విజయవాడలో వింత ప్రేమకథ
Rivaba Jadeja: మహిళా ఎంపీతో గొడవ పెట్టుకున్న రవీంద్ర జడేజా భార్య.. వీడియో వైరల్