Coronavirus: భారత్‌లో 24 గంటల్లో 18వేల కరోనా కేసులు.. కేరళలో ఎక్కువగా!

రెండేళ్ల పాటు కరాళ నృత్యం చేస్తూ విస్తరించిన కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది.

Coronavirus: భారత్‌లో 24 గంటల్లో 18వేల కరోనా కేసులు.. కేరళలో ఎక్కువగా!

Corona (3)

Updated On : October 5, 2021 / 10:23 AM IST

India Coronavirus Updates: రెండేళ్ల పాటు కరాళ నృత్యం చేస్తూ విస్తరించిన కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. మూడో వేవ్ వస్తుందంటూ వార్తలు వినిపించినా కేసులు తగ్గుతూనే ఉండడంతో కాస్త ఊపిరి పిల్చుకుంటున్నారు అధికారులు. భారతదేశంలో కరోనా వైరస్ కేసులలో నిరంతర హెచ్చుతగ్గులు కనిపిస్తుండగా.. లేటెస్ట్‌గా విడుదలైన డేటా ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 18 వేల 346 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో కరోనా కారణంగా దేశంలో 263 మంది చనిపోయినట్లుగా ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 29 వేల 639 మంది కోలుకోగా.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 52వేల 902కి చేరుకుంది. 209రోజుల్లో ఇదే అతి తక్కువ కావడం విశేషం. మొత్తం కోలుకున్న వ్యక్తుల సంఖ్య 3 కోట్ల 31 లక్షల 50 వేల 886కి చేరుకుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు నాలుగు లక్షల 49 వేల 260 మంది మరణించారు.

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం 91 కోట్ల 54 లక్షల 65 వేల 826 మందికి వ్యాక్సిన్లు వేసినట్లుగా వెల్లడించింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR). దేశంలో ఒక్క కేరళలోనే ఎక్కువగా కేసులు వస్తూ ఉన్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 8వేల 850కేసులు నమోదవగా.. 149మంది ఇదే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న ఏకైక రాష్ట్రం కేరళనే.