మోదీని ట్రంప్‌ అమెరికాకు ఆహ్వానించారన్న వైట్‌హౌస్‌ ప్రతినిధి.. ఆ దేశానికి మోదీ ఎప్పుడు వెళ్తున్నారో తెలుసా?

ట్రంప్‌ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండడం గమనార్హం.

మోదీని ట్రంప్‌ అమెరికాకు ఆహ్వానించారన్న వైట్‌హౌస్‌ ప్రతినిధి.. ఆ దేశానికి మోదీ ఎప్పుడు వెళ్తున్నారో తెలుసా?

File,PC:ANI

Updated On : February 4, 2025 / 2:23 PM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12న అమెరికా వెళ్లనున్నారు. ఆ దేశంలో మోదీ రెండు రోజులపాటు పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. మోదీని ట్రంప్‌ అమెరికాకు ఆహ్వానించారని వైట్‌హౌస్‌ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

మోదీ పారిస్‌ పర్యటన అనంతరం అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లనున్నట్లు సమాచారం. పారిస్‌లో జరిగే ఏఐ సదస్సులో మోదీ ఫిబ్రవరి 10న పాల్గొంటారు. ఆ మరుసటి రోజు కూడా అక్కడే ఉంటారు.

 Also Read: ఇకపై వారిని నడిరోడ్డుపై కాల్చి పారేస్తాం: మంత్రి సంచలన ప్రకటన

ఆ తర్వాత ఫిబ్రవరి 12న వాషింగ్టన్‌ డీసీకి వెళ్లి, ఆ తర్వాతి రోజు డొనాల్డ్‌ ట్రంప్‌తో మోదీ సమావేశం అవుతారు. డొనాల్డ్ ట్రంప్‌ అధికారం చేపట్టాక పలు దేశాలపై టారిఫ్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో మోదీ అమెరికా వెళ్తుండడం గమనార్హం. చైనాకు, అమెరికాకు పడడం లేదన్న విషయం తెలిసిందే.

చైనాను ఎదుర్కోవటానికి వేసుకున్న ప్రణాళికల్లో భాగంగా అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌ ఉంది. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అధిక సుంకాలను విధిస్తోందని ట్రంప్ గతంలో అన్నారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ట్రంప్‌ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.