Booster Dose : దేశంలో 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్!

40 ఏళ్లు పైబడినవారందరూ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని టాప్ ఇండియన్ జీనోమ్ సైంటిస్టులు సిఫార్సు చేశారు. COVID-19 యొక్క జన్యు వైవిధ్యాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం

Booster Dose : దేశంలో 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్!

Vaccine

Booster Dose :  40 ఏళ్లు పైబడినవారందరూ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని టాప్ ఇండియన్ జీనోమ్ సైంటిస్టులు సిఫార్సు చేశారు. COVID-19 యొక్క జన్యు వైవిధ్యాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పరీక్షా ప్రయోగశాలల నెట్‌వర్క్ అయిన భారత కోవిడ్ జెనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియం (INSACOG) వారపు బులెటిన్‌లో ఈ సిఫార్సు చేసింది.

టీకాలు తీసుకోని ప్రమాదంలో ఉన్న వ్యక్తులందరికీ టీకాలు వేయడం,40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి బూస్టర్ డోస్‌ను పరిగణనలోకి తీసుకోవడం, ముందుగా అత్యంత అధిక-రిస్క్,వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా కలిగి ఉన్న వారిని లక్ష్యంగా చేసుకోవడం పరిగణించబడాల్సిన విషయమని INSACOG బులెటిన్ తెలిపింది.

దేశంలో కరోనా పరిస్థితిపై లోక్‌సభలో చర్చ సందర్భంగా సభ్యులు కోవిడ్ వ్యాక్సిన్‌ బూస్టర్ డోస్ కోసం డిమాండ్‌,కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతున్న  నేపథ్యంలో ఈ సిఫార్సు తెరమీదకు వచ్చింది. అవసరమైన ప్రజారోగ్య చర్యలను ప్రారంభించడానికి, ఈ వేరియంట్ ఉనికిని ముందస్తుగా గుర్తించడానికి జన్యుపరమైన నిఘా చాలా కీలకమని INSACOG తెలిపింది.

ALSO READ Omicron Suspects : ఢిల్లీ హాస్పిటల్ లో 12 ఒమిక్రాన్ అనుమానిత కేసులు!