గన్ తో బెదిరించి బిల్డర్ ఇంట్లో చోరీ : వీడియో

మధ్యప్రదేశ్ లో మంగళవారం (నవంబర్ 26, 2019) రాత్రి చోరీ జరిగింది. ఓ బిల్టర్ ఇంటికి ఐదుగురు దొంగలు వెళ్లి ఇంటి బయట కూర్చున్న సెక్యూరిటీ గార్డుతో పాటు మరో వ్యక్తిని తుపాకులు, మారణాయుధాలతో బెదిరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లాసుడియా ఏరియాలో చోటుచేసుకుంది.
ఈ ఐదుగురు దొంగలు ఎంతో తెలివిగా అక్కడున్న సెక్యూరిటీ గార్డుని, ఇంక్కో వ్యక్తిని ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్లి.. నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగిలించారు. విషయం తెలుసుకున్న బిల్డర్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.
ఆ దంగలు ఇంటి బయట ఉన్న సెక్యూరిటీ గార్డును బెదిరించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఇంటి ఓనర్ వెంటనే సీసీటీవీ ఫుటేజీ తీసుకెళ్లి పోలీసులకు చూపించారు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు దర్యార్తు చేస్తున్నారు.
#WATCH 5 men commit robbery at a builder’s residence in Indore’s Lasudia area keeping the guard at gunpoint. SP Indore says, “4-5 men can be seen in the CCTV footage. Investigation is being conducted from all angles.” (26.11) #MadhyaPradesh pic.twitter.com/jS1Kk28FO2
— ANI (@ANI) November 27, 2019