Insurance : రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి, నష్టపరిహారంగా రూ.కోటి చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు ఆదేశం

Insurance : ప్రమాదానికి కారణమైన ట్రక్కుకి బీమా చేసిన కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. దాంతో ఆ కంపెనీపై వారు కేసు వేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

Insurance : రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి మృతి, నష్టపరిహారంగా రూ.కోటి చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు ఆదేశం

Insurance(Photo : Google)

Updated On : May 3, 2023 / 12:21 AM IST

Insurance : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐఐటీ పాస్ ఔట్ విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని కోర్టు ఆదేశించిన ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థి తల్లిదండ్రులు ఆ మొత్తాన్ని ఇవ్వాలని స్థానిక కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని ప్రమాదానికి కారణమైన ట్రక్కుకు బీమా చేసిన బీమా కంపెనీ భరించాల్సి ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది.

ఇండోర్ కి చెందిన ఆయుష్ గుప్తా(23) ఐఐటీ మద్రాస్ లో ఎంటెక్ చదివాడు. చెన్నైలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం ఏడాదికి రూ.12లక్షలు. దాంతో ఆయుష్ గుప్తా తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. తమ కొడుకు ప్రయోజకుడు అయ్యాడని వాళ్లు చాలా సంతోషించారు. ఇంతలో తీరని విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆయుష్ గుప్తా మరణించాడు. 2018 జూలై 25న చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయుష్ మరణించాడు. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయుష్ గుప్తా స్పాట్ లోనే చనిపోయాడు.(Insurance)

Also Read..Apple iPhones Steal : కస్టమర్ల ఐఫోన్లను కొట్టేసిన డెలివరీ ఏజెంట్.. ఆ 10 ఐఫోన్లను ఎలా మార్చాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

ఆయుష్ గుప్తా తల్లిదండ్రులు రాజీవ్ కుమార్ గుప్తా, వందన.. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పై జిల్లా కోర్టులో కేసు వేశారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కుకి బీమా చేసిన కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. దాంతో ఆ కంపెనీపై వారు కేసు వేశారు.

Also Read..Cyber Fraud : గిఫ్ట్‌లకు ఆశపడ్డారు, రూ.25లక్షలు పోగొట్టుకున్నారు.. సంగారెడ్డిలో భారీ సైబర్ మోసం

అయితే, నష్టపరిహారం చెల్లించేందుకు బీమా కంపెనీ ఒప్పుకోలేదు. ఆయుష్ గుప్తా ప్రమాదం సమయంలో హెల్మెట్ ధరించలేదని, అలాగే అతడికి లైసెన్స్ లేదని, ఇక ఆయుష్ తల్లిదండ్రులు బాగా ఉన్నవాళ్లేనని, కాబట్టి నష్టపరిహారం పొందేందుకు వారు అర్హులు కాదని ఇన్సూరెన్స్ కంపెనీ వాదనలు వినిపించింది. తాము నష్టపరిహారం చెల్లించేది లేదంది.

అయితే, బీమా కంపెనీ వాదనలను కోర్టు రిజక్ట్ చేసింది. వారి వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఒక కోటి 13లక్షల 41వేల 932 రూపాయలను కచ్చితంగా ఆయుష్ గుప్తా తల్లిదండ్రులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని బీమా కంపెనీని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. కేసు వేసిన రోజు నుంచి ఇప్పటివరకు ఆ మొత్తంపై 6శాతం వడ్డీ కూడా చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది కోర్టు. బీమా కంపెనీ పరిహారం మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తేల్చి చెప్పింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం పరిహారం మొత్తాన్ని ఆశ్రితులకు కాకుండా వారసులకే అందజేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

Also Read..Maharashtra : మహారాష్ట్రలో మరోసారి రెచ్చిపోయిన కొడవళ్ల గ్యాంగ్.. మెడికల్ షాప్ ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి