అభినందన్ పై గౌరవం : పాప పేరు అభినందన 

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 06:51 AM IST
అభినందన్ పై గౌరవం : పాప పేరు అభినందన 

Updated On : March 6, 2019 / 6:51 AM IST

బాగల్‌కోట్‌ : భారతర్ వింగ్ కమాండర్ అభినందన్ పేరు భారత్‌ యావత్తు మారు మ్రోగిపోతోంది. అభినందన్ అనే పేరు భారత్ కు ఓ బ్రాండ్‌గా మారిపోయింది.  శత్రు దేశపు  చెరలో కూడా చెక్కుచెదరని ధీరత్వం ప్రదర్శించి భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఈ రియల్ హీరో అభినందన్ వర్థమాన్. ఇప్పుడు అతనికి ఎనలేని గౌరవాభిమానాలతో నీరాజనాలు పడుతున్నారు. అతనిపై ఉన్న గౌవరానికి సూచనగా అని పేరునే తమ బిడ్డలకు పెట్టుకుంటున్నారు. ఇటీవల పుట్టిన తమ బిడ్డలకు కొంత మంది తల్లిదండ్రులు అభినందన్ పేరు పెట్టుకొని మురిసిపోతున్నారు. ధీర జవాన్‌కు తాము ఇస్తున్న సమున్నత గౌరవంగా దాన్ని అభివర్ణిస్తున్నారు. 
 

కర్ణాటకలోని బాగల్‌కోట్‌కు చెందిన దంపతులు అరవింద్, పూర్ణిమ ఇటీవలే పుట్టిన తమ చిన్నారికి ‘అభినందన’ అని పేరు పెట్టుకున్నారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు గౌరవ సూచకంగా తమ పాపకు ఈ పేరు పెట్టుకున్నట్లు వారు తెలిపారు. అరవింద్..స్థానిక మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 11న తమకు ఆడబిడ్డ జన్మించిందని..అభినందన్ దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని..అందుకే ఆయనపై తమకున్న గౌరవంతో..బారసాల రోజులన తమ బిడ్డకు ‘‘అభినందన’’ అనే పేరు పెట్టుకున్నామని అరవింద్ తెలిపారు. ఇలా దేశ వ్యాప్తంగా పుట్టిన మగపిల్లలకు అభినందన్ అని..ఆడపిల్లకు అభినందన అని..ఇంకొందరు సర్జికల్ దాడులలో వినియోగించిన మిరాజ్ విమానాల పేర్లను కూడా పెట్టుకుంటు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే అభినందన్‌ పాకిస్థాన్‌ చెరను వీడి సరిగ్గా భారత్‌లో అడుగుపెట్టిన క్షణంలో పుట్టిన తమ కుమారుడికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు మహారాష్ట్రలోని భీవాండి దంపతులు ఆకాశ్‌, మోనిక తెలిపారు.