iPhone Hacking: ఫోన్ ట్యాపింగ్‭పై ప్రభుత్వంపై విపక్షాల ఆగ్రహం.. వివరణ ఇచ్చుకున్న యాపిల్ సంస్థ

విపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మోదీ ప్రాణం అదాని చేతిలో ఉంది. అదానీ కోసమే మోదీ పని చేస్తున్నారు. అదానీకి మోదీ ఉద్యోగి మాత్రమే. ఇంత కాలం మోదీ నెంబర్ 1, అదానీ నెంబర్ 2 అనుకున్నాం. కానీ అదానీ నెంబర్ 1, మోదీ నెంబర్ 2 అని తెలిసింది

iPhone Hacking: ఫోన్ ట్యాపింగ్‭పై ప్రభుత్వంపై విపక్షాల ఆగ్రహం.. వివరణ ఇచ్చుకున్న యాపిల్ సంస్థ

Updated On : October 31, 2023 / 3:58 PM IST

iPhone Hacking: విపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాపిల్ కంపెనీ నుంచి అలర్ట్ మెసేజ్ ను చూపిస్తూ.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే విపక్షాల ఆరోపణలపై స్వయంగా యాపిల్ సంస్థే స్పందించింది. ఆ అలర్ట్ తాము పంపలేదని, ఒక్కోసారి ఫాల్స్ అలార్మ్ కూడా కావొచ్చని, అటాకర్లను గుర్తించలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం దేశ రాజకీయాల్ని కుదిపివస్తోంది.

రాహుల్ గాంధీ ఏమన్నారు?
‘‘విపక్షాల నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మోదీ ప్రాణం అదాని చేతిలో ఉంది. అదానీ కోసమే మోదీ పని చేస్తున్నారు. అదానీకి మోదీ ఉద్యోగి మాత్రమే. ఇంత కాలం మోదీ నెంబర్ 1, అదానీ నెంబర్ 2 అనుకున్నాం. కానీ అదానీ నెంబర్ 1, మోదీ నెంబర్ 2 అని తెలిసింది. ఎంత ట్యాపింగ్ చేసినా భయపడం. కావాలంటే నా ఫోనే ఇస్తా. యువతకు న్యాయం జరగనంత వరకు దేశం అభివృద్ధి చెందదు. కులగణనతోనే యువతకు న్యాయం జరుగుతుంది. కానీ ప్రభుత్వం అదానీకి దోచి పెడుతోంది. విద్యుత్, రైలు, ఫ్లైట్ ఇలా అన్నింట్లోనూ అదాని టాక్స్ వసూలు చేస్తున్నారు’’ అని అన్నారు.

యాపిల్ వివరణ
హ్యాకింగ్ ప్రయత్నాలపై యాపిల్ సంస్థ స్పందించింది. తమ అలర్ట్ మెసేజ్ ఏ దేశాన్ని ఉద్దేశించి పంపలేదని పేర్కొంది. వాస్తవానికి 150కి పైగా దేశాల్లో తమ వినియోగదారులకు థ్రెట్ నోటిఫికేషన్లు యాపిల్ సంస్థ పంపినట్లు నోటిఫికేషన్ వచ్చింది. ఒక్కోసారి ఫాల్స్ అలార్మ్ కూడా కావొచ్చని, అటాకర్లను గుర్తించలేమని సంస్థ పేర్కొంది. ప్రభుత్వాల ప్రోద్భలంతో జరిగే దాడులకు నిధులు, అధునాతన పరిజ్ఞానం ఉంటుందని, థ్రెట్ అలర్ట్ నోటిఫికేషన్ల జారీ వెనుక కారణమేంటో మేం స్పష్టంగా చెప్పలేమని పేర్కొంది. దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించడం కూడా సాధ్యం కాదని యాపిల్ పేర్కొంది.