Video: హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. దేవుడికే చెందుతుందని తిరిగి ఇవ్వని ఆలయ నిర్వాహకులు..

డబ్బులు తీస్తున్న సమయంలో అతడి ఐఫోన్‌ ఒక్కసారిగా హుండీలో పడిపోయింది. ఈ విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలిపాడు.

Video: హుండీలో పడిపోయిన ఐఫోన్‌.. దేవుడికే చెందుతుందని తిరిగి ఇవ్వని ఆలయ నిర్వాహకులు..

Updated On : December 21, 2024 / 2:39 PM IST

మందిరాల్లోని హుండీల్లో డబ్బు, బంగారం వంటివి వేస్తుంటారు భక్తులు. అలా వచ్చిన సొమ్మంతా స్వామివారి సొంతమవుతుందని చెబుతుంటారు. ఓ యువకుడు అనుకోకుండా తన ఐఫోన్‌ను హుండీలో జారవిడుచుకున్నాడు. దీంతో ఆ ఐఫోన్‌ కూడా స్వామి వారికే చెందుతుందని ఆలయ నిర్వాహకులు ఖరాఖండిగా చెప్పేశారు.

ఈ ఘటన చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లోని అరుల్మిగు కందస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. వినయాగపురానికి చెందిన దినేశ్ అనే భక్తుడు దేవుడిని సందర్శించుకోవడానికి గుడికి వెళ్లాడు. హుండీ వద్దకు వెళ్లి నిలబడి అందులో డబ్బులు వేయాలనుకున్నాడు. డబ్బులు తీయడానికి తన చొక్కా జేబులో చేతిని పెట్టాడు.

డబ్బులు తీస్తున్న సమయంలో అతడి ఐఫోన్‌ ఒక్కసారిగా హుండీలో పడిపోయింది. ఈ విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలిపాడు. హుండీలో పడినదేదైనా దేవుడికే చెందుతుందని ఆలయ అధికారులు చెప్పడంతో దినేశ్ ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఐఫోన్‌లోని సిమ్‌కార్డుని మాత్రం తీసుకోనిచ్చారు. అలాగే, ఫోనులోని ముఖ్యమైన డేటాను మరో ఫోనులోకి ఎక్కించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు. చివరకు ఖాళీ చేతులతోనే దినేశ్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా ఏంటి?: అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి ఎద్దేవా