IPS Officer Eat Jalebis : నన్ను జిలేబీలు తిననివ్వటం లేదన్న ఐపీఎస్ అధికారి.. నువ్వు ఇంటికి రా… భార్య రియాక్షన్!

ఆ ఐపీఎస్ అధికారికి జిలిబీలంటే మహా ఇష్టం.. చిన్నప్పుడు జిలేబీలను తెగ తినేసేవారు. కానీ, పెరిగి పెద్దయ్యాక తనకు ఎంతో ఇష్టమైన జిలేబీలు తినలేకపోతున్నానంటూ ఐపీఎస్ అధికారి సందీప్ మిట్టల్ ట్వీట్ చేశారు.

IPS Officer Eat Jalebis : నన్ను జిలేబీలు తిననివ్వటం లేదన్న ఐపీఎస్ అధికారి.. నువ్వు ఇంటికి రా… భార్య రియాక్షన్!

Ips Officer Says His Wife Doesn't Let Him Eat Jalebis

Updated On : July 22, 2021 / 6:53 PM IST

IPS officer Eat Jalebis : ఆ ఐపీఎస్ అధికారికి జిలేబీలంటే మహా ఇష్టం.. చిన్నప్పుడు జిలేబీలను తెగ తినేసేవారు. కానీ, పెరిగి పెద్దయ్యాక తనకు ఎంతో ఇష్టమైన జిలేబీలు తినలేకపోతున్నానంటూ ఐపీఎస్ అధికారి సందీప్ మిట్టల్ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.


తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్ మిట్టల్ తనకు జిలేబీ తినాలి అనిపిస్తోందన్నారు. కానీ, తన భార్య జిలేబీలను తిననివ్వడం లేదని ఆయన ట్వీట్ చేశారు. అంతే.. ఆ ట్వీట్ కాస్తా తన భార్య రీచా మిట్టల్ వరకు వెళ్లింది. వెంటనే ఆమె.. జిలేబీలు కావాలా నాయనా.. అయితే ఈరోజు ఇంటికి రా అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడా ఆ ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


మిట్టల్.. నా చిన్నప్పుడు జిలేబీలు ఒక్కొక్కటి 25 పైసలకు వచ్చేవి.. పెద్దయ్యాక.. రోజుకు మూడు నుంచి నాలుగు జిలేబీలు తినొచ్చు అనుకున్నా.. నేను డబ్బులు సంపాదిస్తున్నా.. కానీ, నా భార్య నన్ను జిలేబీలు తిననివ్వడం లేదు’ అని ట్వీట్ చేశారు. అంతే ఆ ట్వీట్ కు భార్య రిచా మిట్టల్.. మీరు ఈ రోజు ఇంటికి రండి అని రిప్లయ్ ఇచ్చారు.

వీరిద్దరి ట్వీట్లు వైరల్ కావడంతో అనేక మంది నెటిజన్లు రీట్వీట్లు చేయగా.. 1000 లైక్స్ వచ్చాయి. కామెంట్ సెక్షన్ కూడా సరదా కామెంట్లతో నిండిపోయింది. జిలేబీలు తిని తిని ఐపీఎస్‌ ఆఫీసర్‌కు షుగర్‌ వచ్చిందేమో.. అందుకే పాపం ఐపీఎస్‌ ఆఫీసర్‌ కు జిలేబీలు ఇవ్వడం లేదనకుంట అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేశారు.