IRCTC New Website : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ల బుకింగ్ ఇక మరింత సులభం.. కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు
IRCTC New Beta Website : రైల్వే టికెట్ బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్యలను తగ్గించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు IRCTC కొత్త బీటా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
IRCTC Launched New Beta Website
IRCTC New Website : రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. టికెట్ బుకింగ్‌ను మరింత వేగంగా, సులభంగా మార్చే లక్ష్యంతో కొత్త IRCTC బీటా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కొత్త డిజైన్, వేగవంతమైన పనితీరు, సరళమైన నావిగేషన్‌తో ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
Also ReadLPG Cylinder Delivery : ఇకపై స్విగ్గీలో ఎల్పీజీ సిలిండర్.. బుకింగ్ చేసిన పది నిమిషాల్లోనే..
రైల్వే టికెట్ బుకింగ్‌లో ఎదురవుతున్న సమస్యలను తగ్గించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు IRCTC కొత్త బీటా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం బీటా వెర్షన్ రూపంలో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌పై ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించి, పూర్తి స్థాయి వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో ఐఆర్సీటీసీ తన టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన బీటా వెర్షన్ ఈ నెల 15 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వెబ్సైట్లో ప్రయాణికులకు సులభంగా, వేగంగా టికెట్ బుక్ చేసుకునేందుకు వీలవుతుంది. ఇందుకుగాను రైల్వే శాఖ నాలుగు ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది.
ఐఆర్సీటీసీ కొత్త వెబ్సైట్లో ప్రకటనలు, అనవసరపు క్యాప్చాలు లేవు. సాధారణ సమయాల్లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు చికాకు తెప్పించేలా క్యాప్చా వెరిఫికేషన్‌ను తొలగించారు. దీని వల్ల తత్కాల్ బుకింగ్ కూడా మరింత వేగంగా ముగుస్తుంది. టికెట్ బుక్ చేసేటప్పుడు స్క్రీన్‌పై వచ్చే అనవసరపు పాప్-అప్లలు, మిరుమిట్లు గొలిపే గ్రాఫిక్స్ ప్రకటనలు, ఇబ్బంది పెట్టే క్యాప్చాలను పూర్తిగా తొలగించింది. దీనివల్ల ప్రయాణికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
కొత్త వెబ్సైట్లో అన్ని తరగతుల సీట్ల లభ్యత ఒకే స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో ఇది ఎంతో సహాయపడుతుంది. రెగ్యులర్‌గా రైలులో ప్రయాణించే వారి వివరాలు వెబ్సైట్లో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) ద్వారా నిమిషానికి 1.5 లక్షల కంటే ఎక్కువ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బీటా వెర్షన్ ను ఐఆర్సీటీసీ ఇ-టి కెటింగ్ పోర్టల్ ద్వారా లేదంటే ప్రస్తుత ఐఆర్సీటీసీ హోమ్ పేజీలో ఉన్న లింక్‌తో యాక్సెస్ చేయవచ్చు
దివ్యాంగులు, విద్యార్థులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించే రోగులకు అందించే ప్రత్యేక రాయితీలు, సేవలను వేర్వేరు పోర్టల్స్ ద్వారా కాకుండా ఈ సరికొత్త వెబ్సైట్లో ఒకే ప్లాట్‌ఫారమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. దేశంలోని అందరు ప్యాసింజర్లకు ఉపయోగపడేలా ఈ పోర్టల్‌ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఐఆర్సీటీసీ-ఐపే, యూపీఐ సాంకేతికతను మరింత పటిష్టం చేశారు.
