Delhi HC Covid Callertune : టీకా డోసులే లేవు.. చిరాకు కాలర్‌ ట్యూన్‌తో విసిగిస్తున్నారు..

దేశంలో వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిపడా టీకాలు లేవు కానీ ఫోన్‌లో కాలర్ ట్యూన్, సందేశాల ద్వారా విసిగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో టీకాల కొరతపై ఢిల్లీ హైకోర్టు విమర్శలు గుప్పించింది.

Delhi HC Covid Callertune : టీకా డోసులే లేవు.. చిరాకు కాలర్‌ ట్యూన్‌తో విసిగిస్తున్నారు..

Irritating Message On Vaccination When There Are No Doses Delhi High Court

Updated On : May 14, 2021 / 9:14 AM IST

Delhi HC on Covid Callertune : దేశంలో వ్యాక్సినేషన్‌పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిపడా టీకాలు లేవు కానీ ఫోన్‌లో కాలర్ ట్యూన్, సందేశాల ద్వారా విసిగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో టీకాల కొరతపై ఢిల్లీ హైకోర్టు విమర్శలు గుప్పించింది. కాల్ చేసినప్పుడల్లా ఫోన్‌లో ఒక చిరాకు కాలర్‌ ట్యూన్‌తో విసిగిస్తున్నారని మండిపడింది. ఇది ఎంత కాలం కొనసాగుతుందో తెలియదంటూ అసహనం వ్యక్తం చేసింది.

ప్రజలకు టీకాలు వేయాలని.. కానీ కేంద్రం వద్ద సరిపడా టీకాలు లేవని విమర్శించింది. అలాంటప్పుడు తప్పకుండా టీకాలు వేసుకొండంటూ ప్రజలకు కాలర్ ట్యూన్ ద్వారా ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించింది. ప్రజలకు టీకా ఎవరు వేస్తారని.. ఆ సందేశం ఉద్దేశం ఏంటో తమకు అర్థం కావడంలేదని చురకలంటించింది. ఇంకో పదేళ్ల తర్వాత కూడా ఈ కాలర్‌ ట్యూన్‌ కొనసాగేలా కనిపిస్తోందంటూ కౌంటర్‌ ఇచ్చింది.

సందేశం చెప్పడం కంటే ఎక్కువ ఏదైనా చేయాల్సి ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇంకేదైనా కొత్తది వింటే కొంత ఉపయోగకరంగా ఉంటుందంటూ సెటైర్‌ వేసింది. ఒకవేళ డబ్బులు తీసుకున్నా సరే, అందరికీ టీకా ఇవ్వాలని… ఈ విషయం చిన్నపిల్లలుకు కూడా తెలుసని జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.