ఇది Indiaనా లేదంటే Hindiaనా.. స్టాలిన్ ఘాటు కామెంట్లు

ఇది Indiaనా లేదంటే Hindiaనా.. స్టాలిన్ ఘాటు కామెంట్లు

Updated On : August 11, 2020 / 12:00 PM IST

డీఎమ్కే ప్రెసిడెంట్ ఎమ్కే స్టాలిన్ సోమవారం ఎంపీ కణిమొజి ఎదుర్కొన్న కామెంట్లకు మనస్తాపం చెందినట్లుగా పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తన సోదరిని ఇండియన్ అయినప్పటికీ మీకు హిందీ రాదా అని అడిగిన ప్రశ్నపై స్పందించారు. ఇండియన్ అనిపించుకోవడానికి హిందీ తెలిసి ఉండటం కొలమానమా అని ప్రశ్నించారు.



‘హిందీ ఇండియన్ అనిపించుకోవడానికి కొలమానమా.. ఇది ఇండియానా.. లేదా హిందియానా’ అని డీఎమ్కే చీఫ్ ఓ ట్వీట్ లో ప్రశ్నించారు. సీఐఎస్ఎఫ్ అఫీషియల్ చెన్నై ఎయిర్ పోర్టు వద్ద కణిమొజి హిందీలో మాట్లాడలేకపోవడంతో మీరు ఇండియనేనా అని ప్రశ్నించారు.

స్టాలిన్ పార్టీ పాలసీ ప్రకారం.. దశాబ్దాల పాటుగా హిందీని సమాజంలోకి జొప్పించకూడదు. మరో ట్వీట్ లో బహుళత్వాన్నిసమాధి చేయాలని చూస్తున్నట్లుగా పేర్కొన్నారు.



ఆదివారం కణిమొజి ట్వీట్ లో ‘ఇవాళ ఎయిర్ పోర్టులో తమిళ్ లేదా ఇంగ్లీషులో మాట్లాడండి. నాకు హిందీ తెలియదని అడిగినందుకు సీఐఎస్ఎఫ్ ఆఫీసర్.. నువ్వు ఇండియనేనా అని ప్రశ్నించారు. దీనిపై పారామిలటరీ ఫోర్స్ ను ఎంక్వైరీ వేయాలని అడుగుతున్నాను.

‘సీఐఎస్ఎఫ్ పాలసీలో ఏదైనా పర్టిక్యులర్ లాంగ్వేజ్ రుద్దాలి అనేది లేదు’ అని వెల్లడించారు.