CISCE ISC 12th Result 2022: ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంకు సాధించిన 18మంది వీరే..

ఐఎస్‌సీ (ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్) 12వ తరగతి ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 18మంది (99.75శాతం) మొదటి ర్యాంకు సాధించారు.

CISCE ISC 12th Result 2022: ఐఎస్‌సీ 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంకు సాధించిన 18మంది వీరే..

Isc Class 12 Result

Updated On : July 24, 2022 / 6:45 PM IST

CISCE ISC 12th Result 2022: ఐఎస్‌సీ (ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్) 12వ తరగతి ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (CISCE) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 18మంది (99.75శాతం) మొదటి ర్యాంకు సాధించారు. మొత్తం 99.38 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 99.52శాతం, బాలురు 99.26శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో భాగంగా దేశంలోని దక్షిణ ప్రాంతం విద్యార్థులు 99.81శాతంతో ఉత్తీర్ణత సాధించగా, విదేశీ విద్యార్థులు 99.64శాతం మంది పాసయ్యారు. ఇక దేశంలోని పశ్చిమం రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 99.58శాతం, ఉత్తర ప్రాంతంలోని రాష్ట్రాల విద్యార్థులు 99.43శాతం, తూర్పు ప్రాంతంలోని రాష్ట్రాల విద్యార్థులు 99.18శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

ICSE, ISC Results : విద్యార్థులకు అలర్ట్.. 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

ఈ ఫలితాల్లో మొదటి స్థానంలో 99.73శాతం మార్కులతో 18మంది నిలవగా, 99.05శాతం మార్కులతో 58 మంది విద్యార్థులు రెండో ర్యాంకు సాధించారు. ఇక 99.25శాతం మార్కులతో 78 మంది మూడవ ర్యాంకు సాధించారు.

మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా..

ఆనందిత మిశ్ర, ఉపాసన నంది, హరిణి రామ్మోహన్, నమ్య అశోక్ నిచాని, కార్తీక్ ప్రకాష్, అనన్య అగర్వాల్, ఆకాష్ శ్రీవాస్తవ , ఆదిత్య విష్ణు ఝివానియా, ఫహీమ్ అహ్మద్, సిమ్రాన్ సింగ్, అక్షత్ అగర్వాల్, ప్రక్కిరత్ సింగ్, MD అర్ష్ ముస్తఫా, ప్రతితి మజుందర్, అపూర్వ కాశీష్, పృథ్వీజ మండలం, నిఖిల్ కుమార్ ప్రసాద్, అభిషేక్ బిశ్వాస్ లు 99.75శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు.

Arpita Mukherjee: మమత ప్రభుత్వంలో అర్పిత ముఖర్జీ పాత్ర ఏమిటి? మంత్రితో ఆమెకున్న సంబంధం అదేనా? ఈడీ ఏం చెబుతోంది..

ఈ ఫలితాలను CISCE వెబ్ సైట్లు cisce.org, results.cisce.org ద్వారా చూడొచ్చు. ఫలితాలు తెలుసుకోవాలంటే విద్యార్థులు యూనిక్ ఐడింటిటీ నెంబర్ తో పాటు ఇండెక్స్ నంబర్ క్యాప్చ్ కోడ్ ను ఎంటర్ చేసి చూసుకోవచ్చు.