ISRO: న్యూ ఇయర్‌ తొలి వారంలోనే ఇస్రో ఏం సాధించనుందో తెలుసా?

లెగ్రాంజ్ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉపగ్రహాన్ని మొదట జియో ట్రాన్స్‌ఫర్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ISRO: న్యూ ఇయర్‌ తొలి వారంలోనే ఇస్రో ఏం సాధించనుందో తెలుసా?

Isro Aditya L1

Aditya-L1: న్యూ ఇయర్‌ తొలి వారంలోనే ఇస్రో మరో ఘనత సాధించనుంది. 2023లో చంద్రయాన్-3 ల్యాండర్‌ను జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ప్రపంచంలో భారత్ తలెత్తుకునేలా చేసింది ఇస్రో. ఈ ఏడాది సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్‌-1 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

ఇస్రో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌తో ఆదిత్య ఎల్‌-1ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2024 జనవరి తొలి వారంలో ఆ అంతరిక్ష నౌక లాగ్రాంజ్ పాయింట్-L1 వద్దకు చేరుకోనుంది. ఆదిత్య ఎల్-1 లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి చేరుకునేందుకు దాదాపు 125 రోజులు పడుతుందని ఇస్రో ముందుగానే ప్రకటించింది.

లెగ్రాంజ్ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉపగ్రహాన్ని మొదట జియో ట్రాన్స్‌ఫర్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కొన్ని రోజుల్లో లాగ్రాంజ్ పాయింట్-L1కు చేరుకున్న ఆదిత్య L1 తన పేలోడ్స్ ద్వారా పరిశోధన చేయనుంది. మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి.

మరికొన్ని రోజుల్లో క్రూ మాడ్యుల్, అబార్ట్ సిస్టమ్ పరీక్షలను ఇస్రో నిర్వహిస్తుంది. అనంతరం సౌర మండలంలోని గాలులపై ఇస్రో పరిశోధన చేస్తుంది. కరోనాతో పాటు సూర్యుడి కాంతి కిరణాల ప్రభావంపై అధ్యయనం చేయనుంది.

సౌర తుపాన్ల వేళ వెలువడే రేణువులు, కాంతి మండలం, వర్ణ మండలంపై పరిశోధనలు జరుగుతాయి. సూర్యుడిపై పరిశోధనలు చేయడానికి లాగ్రాంజ్ పాయింట్ఎల్‌-1 వద్దే ఉండే వాతావరణం సహకరిస్తుందని ఇస్రో భావిస్తోంది. కొన్ని వేలాది కిలో మీటర్ల వరకు సూర్యుడి కరోనా ఉంటుంది.

Israel Hamas Conflict: గాజాను ధ్వంసం చేస్తున్న ఇజ్రాయెల్‌కు హమాస్ చెరలో ఉన్న తన బందీలను విడిపించడం ఎందుకు అంత పెద్ద సవాలుగా మారింది?