ISRO Chief Somanath : చంద్రయాన్-3తో మన సత్తాఏంటో వాళ్లకు తెలిసింది.. ఆ టెక్నాలజీని ఇవ్వాలని అడిగారు

మన దేశం చాలా శక్తివంతమైన దేశం. ఇది మీకు అర్థమైందా అంటూ విద్యార్థులను ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రశ్నించారు. దేశంలో మన జ్ఞానం, మేధస్సు స్థాయి ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్నారు.

ISRO Chief Somanath : చంద్రయాన్-3తో మన సత్తాఏంటో వాళ్లకు తెలిసింది.. ఆ టెక్నాలజీని ఇవ్వాలని అడిగారు

Isro chief S Somanath

ISRO Chandrayaan-3 : చంద్రుడి దక్షిణ ధృవంపైకి చంద్రయాన్ -3 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించడంతో ప్రపంచ దేశాల నుంచి ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాసా, యూరప్, చైనా అంతరిక్ష సంస్థలకు చెందిన ప్రతి ఒక్కరూ ఇస్రో బృందాన్ని అభినందిస్తున్నారు. తాజాగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ -3 ప్రయోగానికి ముందే ఈ వ్యోమనౌక అభివృద్ధి కార్యకలాపాలను చూసిన అమెరికా.. ఈ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అమ్మాలని కోరినట్లు ఆయన తెలిపారు.

Read Also : Chandrayaan-3 Mission : మరో అద్భుతం సృష్టించిన ఇస్రో.. విక్రమ్ ల్యాండర్లో కదలిక..!

దివంగత మాజీ రాష్ట్రపతి 92వ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలోని ఆయన స్మారక మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మన దేశం చాలా శక్తివంతమైన దేశం. ఇది మీకు అర్థమైందా అంటూ విద్యార్థులను ప్రశ్నించారు. దేశంలో మన జ్ఞానం, మేధస్సు స్థాయి ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. చంద్రయాన్ -3 వ్యోమనౌకను రూపొందించిన తరువాత అమెరికా నుంచి నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) నిపుణులను ఇక్కడకు ఆహ్వానించాం. చంద్రయాన్ -3 గురించి వారికి వివరించాం. చంద్రయాన్ -3లో మనం వినియోగించిన శాస్త్రీయ పరికరాలను చూసి నాసా నిపుణులు ఆశ్చర్య పోయారని సోమనాథ్ చెప్పారు.

Read Also : Chandrayaan-3: ఇప్పుడు రోవర్ ఏమైందంటే? ఇక మన ఆశలు..? చంద్రయాన్-4 గురించి తెలుసా?

తక్కువ ఖర్చుతో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉన్న పరికరాలను వాడారని వారు ఇస్రో బృందాన్ని కొనియాడారు. దీన్ని ఎలా రూపొందించారు? ఈ టెక్నాలజీని మీరు అమెరికాకు ఎందుకు విక్రయించకూడదు? అని అడిగారని సోమనాథ్ తెలిపారు. దీన్నిబట్టి విద్యార్థులు కాలం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవాలి. మేము భారతదేశంలో అత్యుత్తమ పరికరాలు, ఉత్త పరికరాలు, అత్యుత్తమ రాకెట్ లను నిర్మించగల సామర్థ్యం కలిగి ఉన్నామని అన్నారు. ఇదిలాఉంటే వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన గగన్ యాన్ మిషన్ కీలక పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈనెల 21న శ్రీహరి కోట నుంచి గగన్ యాన్ కు టీవీ-డీ1 పరీక్ష నిర్వహిస్తామని, ఆ పరీక్ష తరువాత దీనికి మరో మూడు (డీ2, డీ3, డీ4) పరీక్షలు నిర్వమిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ చెప్పారు.