ISRO: ఇస్రో మరో ఘనత.. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహ ప్రయోగం గ్రాండ్ సక్సెస్
Isro LVM3-M6 BlueBird launch : ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం
Isro LVM3-M6 BlueBird
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం విజయవంతం అయింది. బుధవారం ఉదయం 8.45 గంటలకు ఏపీలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC- షార్) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో ఈ బాహుబలి రాకెట్ LVM3-M6 (లాంచ్ వెహికల్ మార్క్-3 M6)ను విజయవంతంగా ప్రయోగించింది.
అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను రాకెట్ మోసుకెళ్లింది. 15 నిమిషాల్లో మూడు దశల్లో రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు, అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
