చంద్రయాన్ 2: వారం రోజుల్లో విక్రమ్ సిగ్నల్ అందుకోవడం కష్టమే

చంద్రయాన్ 2 మిషన్‌లోని ఆఖరి ఘట్టం పూర్తి కానట్లే కనిపిస్తోంది. విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టి వారం రోజులు కావస్తున్నా దాని సిగ్నల్‌ను అందుకోలేకపోయింది ఇస్రో. గత శనివారం సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన విక్రమ్.. సిగ్నల్ కోల్పోవడంతో మూన్‌పై వంగి ఉన్నట్లుగా పడిపోయింది. దాని నుంచి రెస్పాన్స్ అందుకోవాలని ప్రయత్నించిన ఇస్రో.. నాసా సహాయంతో తీసుకునేందుకు కూడా వెనుకాడలేదు.
ముందుగా ఆచూకీ తెలియకుండా పోయిన విక్రమ్.. ఆర్బిటర్ తీసిన ఫొటోల్లో సేఫ్‌గానే ల్యాండ్ అయినట్లు కనిపించింది. అంత ఎత్తు నుంచి పడినప్పటికీ చంద్రుడి గురుత్వాకర్షణ తక్కువగా ఉండడంతో ముక్కలు కాలేదు. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ తీసుకుని విక్రమ్‌తో పనిచేయించాలని భావించిన ఇస్రోకు ఇంకో వారం రోజుల గడువు మాత్రమే ఉంది. చంద్రుడిపై షఒక్క రోజు అంటే అంటే భూమిపై 14రోజులతో సమానం.
‘ఒక్కో నిమిషం గడుపుతుంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారిపోతుంది. ప్రతి గంట గడిచినకొద్దీ అందులో ఉన్న బ్యాటరీ డ్రైన్ అవుతుంది. దీంతో సిగ్నల్ అందే సమయానికి బ్యాటరీ ఛార్జింగ్ కోల్పోతే కష్టమైపోతుంది. విక్రమ్ నుంచి సిగ్నల్ అందుకోవడంపై చాలా చాలా తక్కువ నమ్మకం ఉంది’ అని ఇస్రో అధికారి వెల్లడించారు.