Chandrayaan-3: జాబిల్లి ఉపరితలంపై రోవర్ చక్కర్లు.. తల్లిప్రేమ చూడండి అంటూ వీడియో షేర్ చేసిన ఇస్రో..

ఇస్రో ట్వీట్ చేసిన వీడియోలో ప్రజ్ఞాన్ రోవర్ ముందుకు, వెనక్కు కదులుతోంది. తద్వారా సరియైన, సురక్షితమైన మార్గంను ఎంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

Chandrayaan-3: జాబిల్లి ఉపరితలంపై రోవర్ చక్కర్లు.. తల్లిప్రేమ చూడండి అంటూ వీడియో షేర్ చేసిన ఇస్రో..

Chandrayaan-3

Updated On : August 31, 2023 / 3:13 PM IST

ISRO Video : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తుంది. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన ల్యాండర్, రోవర్ తమ పనిలో నిమగమ్నమయ్యాయి. చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ పూర్తిచేయాల్సిన పరిశోధనల లిస్టు పెద్దగానే ఉంది.. దీంతో రోవర్ చంద్రుడిపై తమ పనులను చకచకా పూర్తిచేస్తోంది. ఈ క్రమంలో జాబిల్లి ఉపరితలంపై రోవర్ అటూఇటూ తిరుగుతూ సురక్షిత మార్గాన్ని ఎంచుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా ఇస్రో తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

Chandrayaan-3 : ఖనిజాల నిలయంగా ఉన్న చంద్రుడి దక్షిణ ధ్రువం..

ఇస్రో ట్వీట్ చేసిన వీడియోలో ప్రజ్ఞాన్ రోవర్ ముందుకు, వెనక్కు కదులుతోంది. తద్వారా సరియైన, సురక్షితమైన మార్గంను ఎంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇస్రో ట్వీట్ ప్రకారం.. సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటూ రోవర్ తిరుగుతోంది. ప్రజ్ఞాన్ రోవర్ భ్రమణాన్ని ల్యాండర్ ఇమేజర్ కెమెరా బంధించి. తల్లి ఆప్యాయంగా చూస్తుంటే.. చంద్రుడి ఉపరితలంపై చిన్నారి సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉంది కదా ఈ వీడియో’ అంటూ ఇస్రో సరదాగా రాసుకొచ్చింది.

 

అంతకంటే ముందు.. ఇస్రో షేర్ చేసిన వీడియోలో ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉంది. తద్వారా.. చంద్రుడిపై సల్ఫర్ ఉందని మరోసారి ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. రోవర్ మరో పరికరం ఆల్ఫా ప్రాక్టీస్ ఎక్స్‌రే స్పెక్ట్రో‌స్కోప్ (ఏపీఎక్స్‌ఎస్) సల్ఫర్ ఉందని నిర్ధారించింది. అయితే, రెండు రోజుల క్రితం చంద్రుడు ఉపరితలంపై సల్ఫర్‌ ఉందని రోవర్ పరికరం లిబ్స్ గుర్తించింది. లిబ్స్‌లానే సల్ఫర్‌తో పాటు ఇతర మూలకాలు ఉన్నాయని ఆల్ఫా ప్రాక్టీస్ ఎక్స్‌రే స్పెక్ట్రో‌స్కోప్ గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. ఏపీఎక్స్‌ఎస్ వీడియోను విక్రమ్ ల్యాండర్ చిత్రీకరించింది. ఈ వీడియో ఇస్రో విడుదల చేసింది.