Isro Team: మహారాష్ట్రలో ఆకాశం నుంచి పడిన వస్తువులపై ఇస్రో పరిశోధన

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్టుల బృందం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాను సందర్శించారు. ఆకాశం నుంచి రాలిపడిన గుర్తు తెలియని వస్తువుల గురించి ఆరా తీశారు.

Isro Team: మహారాష్ట్రలో ఆకాశం నుంచి పడిన వస్తువులపై ఇస్రో పరిశోధన

Isro

Updated On : April 12, 2022 / 6:46 AM IST

Isro Team: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్టుల బృందం మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాను సందర్శించారు. ఆకాశం నుంచి రాలిపడిన గుర్తు తెలియని వస్తువుల గురించి ఆరా తీశారు. బూస్టర్ రాకెట్ కు సంబంధించిన విడి భాగాలు వారం క్రితం ఆ ప్రాంతంలోని ఆకాశం నుంచి పలు చోట్ల పడిన విషయం తెలిసిందే.

చంద్రపూర్ జిల్లా కలెక్టర్ అజయ్ గుల్హానె ఘటనను కన్ఫామ్ చేస్తూ.. ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లబ్దరీ గ్రామంలోని ఓ ఓపెన్ ప్లాట్ లో గుండ్రని ఇనుప వస్తువు పడి కనిపించింది.

“రెండు మీటర్ల డయామీటర్‌తో ఉన్న సిలిండర్ లాంటి ఓ వస్తువు కనిపించడంతో పరీక్ష కోసం పంపించాం. రెవన్యూ అధికారులను పిలిపించి చుట్టుపక్కల గ్రామాల్లో మరిన్ని వస్తువులు పడ్డాయోమోనని ఆరా తీయమని చెప్పాం” అని కలెక్టర్ అన్నారు.

Read Also: చంద్రయాన్ 3 సహా 19 ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో

అతిపెద్ద రింగుతో పాటుగా సిలిండర్ వంటి వస్తువు కూడా కనిపించింది. అదే ప్రాంతంలో అటువంటి సిలిండర్ పోలి ఉన్న వస్తువులు మరో ఐదు కనిపించాయి.

దీనిపై ఇస్రో ఫేస్‌బుక్ పోస్టులో ఇలా పేర్కొంది. “జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోరినట్లుగా ఇస్రో సైంటిస్టుల బృందం తనిఖీ నిమిత్తం పవన్పూర్ ప్రాంతానికి వెళ్లింది. సైంటిఫిక్ ఎంక్వైరీ జరుపుతున్నాం” అని అందులో రాసుకొచ్చింది.

డెబ్రిస్ మార్గాన్ని ట్రాక్ చేస్తున్న ఖగోళ శాస్త్రవేత్త జొనాథన్ మెక్‌డొవెల్ కథనం ప్రకారం.. ” CZ-3B థర్డ్ స్టేజ్ కు సంబంధించిన ట్యాంకేజి కావొచ్చు. అది మహారాష్ట్రలోని తూర్పు భాగంలో పడినట్లు తెలిసింది” అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.