Ravi Shankar Prasad slams Congress: ఆర్మీపై కాంగ్రెస్ ద్వేషపూరిత వ్యాఖ్యలు: రవిశంకర్ ప్రసాద్

ఆర్మీపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వ్యూహంలో భాగమని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చైనా-భారత్ సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... తవాంగ్ లో ఇటీవల చైనా ఆర్మీకి భారత సైనికులు తగిన రీతిలో సమాధానం చెప్పారని అన్నారు.

Ravi Shankar Prasad slams Congress: ఆర్మీపై కాంగ్రెస్ ద్వేషపూరిత వ్యాఖ్యలు: రవిశంకర్ ప్రసాద్

Ravi Shankar Prasad

Updated On : December 25, 2022 / 6:01 PM IST

Ravi Shankar Prasad slams Congress: ఆర్మీపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వ్యూహంలో భాగమని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చైనా-భారత్ సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ… తవాంగ్ లో ఇటీవల చైనా ఆర్మీకి భారత సైనికులు తగిన రీతిలో సమాధానం చెప్పారని అన్నారు.

రాహుల్ గాంధీ మన ఆర్మీని మరోసారి ప్రశ్నించారని, మన భూభాగాన్ని తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని అడిగారని చెప్పారు. అయితే, అసలు మన భూభాగాన్ని చైనా ఎప్పుడు తమ అధీనంలోకి తీసుకుందని నిలదీశారు. తవాంగ్ లో భారత ఆర్మీ దీటుగా సమాధానం చెప్పిందని అన్నారు. అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగా మన సైనికులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోందని చెప్పారు.

మేడిన్ ఇండియా గురించి రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చైనా తర్వాత అత్యధిక మొబైల్ ఫోన్స్ తయారవుతున్న దేశంగా భారత్ ఉందని చెప్పారు. శాంసంగ్, ఆపిల్ సంస్థల ఫోన్లను ఇప్పుడు భారత్ లో తయారు చేస్తున్నారన్న విషయాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోవాలని ఆయన అన్నారు.

Viral Video: కవర్లో కపుల్స్..! చైనాలో కరోనా రాకుండా ఓ జంట వినూత్న ప్రయత్నం.. వీడియో వైరల్