Viral Video: కవర్లో కపుల్స్..! చైనాలో కరోనా రాకుండా ఓ జంట వినూత్న ప్రయత్నం.. వీడియో వైరల్

చైనాలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతున్న వేళ.. వినూత్న రీతిలో కరోనా నుంచి రక్షించుకునేందుకు ఆ దేశ ప్రజలు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ జంట మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు ప్లాస్లిక్ కవర్లో వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Viral Video: కవర్లో కపుల్స్..! చైనాలో కరోనా రాకుండా ఓ జంట వినూత్న ప్రయత్నం.. వీడియో వైరల్

Couples under cover in China

Viral Video: చైనాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. బీఎఫ్-7 వేరియంట్ ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలకు వేగంగా వ్యాపిస్తుంది. చైనా రాజధానితో పాటు పలు నగరాల్లో ఆస్పత్రుల్లో రద్దీ భారీగా పెరిగింది. నివేదికల ప్రకారం.. చైనాలో దాదాపు 37 మిలియన్ల మంది ప్రజలు ఈ వారంలో కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో చైనాలోని పలు ప్రాంతాల ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు.

China Corona Cases : చైనాలో కరోనా విలయ తాండవం.. ఆ ఒక్క సిటీలోనే ప్రతి రోజు 5 లక్షల కేసులు నమోదు

చైనాలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతున్న వేళ.. వినూత్న రీతిలో కరోనా నుంచి రక్షించుకునేందుకు ఆ దేశ ప్రజలు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ జంట మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు ప్లాస్లిక్ కవర్లో వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దపంతులు కిరాణా సామాన్లు కొనుగోలు కోసం మార్కెట్‌కు వచ్చారు. అయితే, వారు పొడవాటి ప్లాస్టిక్ షీట్‌ను గొడుగువలే చేసుకున్నారు. దానిని పైభాగం నుంచి కింది వరకు ఏర్పాటు చేసుకొని దానిలో ఇద్దరు కలిసి మార్కెట్ కు వచ్చారు.

 

కవర్లోనే ఉండి కావాల్సిన సరుకులను కట్టించుకున్నారు. ఆ తరువాత వాటిని కింది భాగంనుంచి తీసుకున్నారు. అయితే, ఈ జంట వినూత్న చర్యను చూసి స్థానికులు ఎవరూ ఆశ్చర్యపోయినట్లు కనిపించలేదు. ఎందుకంటే.. ప్రస్తుతం చైనాలో కరోనా నుంచి రక్షణ పొందేందుకు పలు వినూత్న పద్దతులను స్థానికులు పాటిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాల వ్యాఖ్యలను చేస్తున్నారు. కూరగాయలకు కరోనా అంటుకుంటే పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ జంట ప్రయత్నం బాగున్నా.. కరోనా రాకుండా ఈ విధానం పూర్తిగా రక్షణ ఇచ్చేదిలాలేదని కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తపరుస్తున్నారు.