కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీ : ఈ రోజే ఢిల్లీలో పోలింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 7, 2020 / 11:33 PM IST
కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీ : ఈ రోజే ఢిల్లీలో పోలింగ్

Updated On : February 7, 2020 / 11:33 PM IST

ఇవాళ(ఫిబ్రవరి-8,2019)ఢిల్లీ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఓట్లు వేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ప్రభుత్వ పగ్గాలు అప్పజెబుతారా లేదా బీజేపీకి అవకాశమిస్తారా ఇద్దరికీ కాకుండా కాంగ్రెస్ కు పాలన పగ్గాలు అప్పజెబుతారా అన్నది ఫిబ్రవరి-11న చూడాలి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 2015ను రిపీట్ చేయాలన్న ఆశతో ఎన్నికలకు వెళ్లింది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు 67 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించి అదే ఊపు అసెంబ్లీ ఎన్నికల్లో వస్తుందన్న ఆశతో ఎన్నికలకు వెళ్లింది

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ రోజు ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఢిల్లీ వ్యాప్తంగా 2,689 లొకేషన్స్ లో 13,750 పోలింగ్ బూత్ లలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 672మంది అభ్యర్థులు బరిలో ఉన్నాయి. అయితే పోటీ ప్రధానంగా ఆప్,బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యనే ఉంది. పోలింగ్ సమయంలో ఎలాంటి అలర్లు జరుగకుండా ఢిల్లీ వ్యాప్తంగా టైట్ సెక్యురిటీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఢిల్లీ వ్యాప్తంగా పోలీస్ ఫోర్స్,పారామిలటరీ సిబ్బందిని రంగంలోకి దించారు.

ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు జరిగాయని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణబీర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఓటర్లు మొత్తం 1కోటీ 47లక్షల 86వేల 382మంది అని,ఇందులో 2లక్షల 32వేల 812మంది 18-19ఏళ్ల వయస్సు వారు అని ఆయన తెలిపారు. క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల విషయానికొస్తే, ఆ విభాగంలో 516 లొకేషన్స్ , 3,704 బూత్‌లు ఉన్నాయని రణబీర్ సింగ్ చెప్పారు. పోలీసు భద్రతతో పాటు, “క్రిటికల్ కేటగిరీ” లోని పోలింగ్ కేంద్రాలకు పారామిలిటరీ భద్రత ఉంటుందని, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు చీప్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు.