జాదవ్ తో నేరం ఒప్పించారు : అంతర్జాతీయ కోర్టులో భారత్ వాదనలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2019 / 10:19 AM IST
జాదవ్ తో నేరం ఒప్పించారు : అంతర్జాతీయ కోర్టులో భారత్ వాదనలు

 గూఢచర్యం ఆరోపణలతో పాక్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో నెదర్లాండ్స్ లోని ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో  భారత తరపున మాజి సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాక్ మిలటరీ కోర్టులో నిబంధనలకు అనుగుణంగా విచారణ జరుగలేదని సాల్వే అన్నారు. న్యాయవాది యాక్సెస్ లేకుండా జాదవ్ ని కస్టడీలో కొనసాగించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలన్నారు. పాకిస్తాన్ జాదవ్ కేసుని ఒక ప్రచార టూల్ గా ఉపయోగించుకుంటోందనడంలో ఏ సందేహం లేదన్నారు.

ఏ మాత్రం ఆలస్యం లేకుండా పాకిస్తాన్ జాదవ్ కు న్యాయవాది యాక్సెస్ ను గ్రాంట్ చేయాలని  అన్నారు. మార్చి-30,2016న జాదవ్ కు న్యాయవాదిని నియమించేందుకు సంబంధించి భారత్ చేసిన రిక్వెస్ట్ ను అందుకొన్న  పాక్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు.  

13సార్లు భారత్  వివిధ డేట్స్ లో పాక్ కు ఈ విషయాన్ని గుర్తు చేసినట్లు తెలిపారు.జూన్-19,2017న విచారణలో సహాయం కోసం చేసిన రిక్వెస్ట్ కు భారత్ స్పందించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం జాదవ్ కు న్యాయవాది యాక్సెస్ తిరస్కరణకు గురైందన్న దాని గురించే కాకుండా ఏ ఉగ్రవాద కార్యక్రమంలో కూడా జాదవ్ పాత్ర ఉందని పాక్ ఎలాంటి క్రెడిబుల్ ఎవిడెన్స్ చూపించలేదని గట్టిగా చెప్పారు.

 జాదవ్ నేరం అంగీకరించాడన్నది క్లియర్ గా పాక్ అతడిని నేరం ఒప్పుకొనేలా చేసిందని సృష్టంగా అర్థమవుతోందన్నారు. క్రిమినల్ విషయాల్లో న్యాయసహాయంపై  షార్క్ సదస్సు నిర్ణయాన్ని పాక్ ప్రభుత్వం ఆమోదించలేదని భారత్ గుర్తుచేసింది. జాదవ్ ని తన కుటుంబసభ్యులతో కలిసేందుకు పాక్ చేసిన ఆఫర్ నిబంధనలు అంగీకరించిన తర్వాత డిసెంబర్-25,2017లో జాదవ్ ఫ్యామిలీ జాదవ్ తో మీట్ అయిందని, అయితే మీటింగ్ జరిగిన విధానాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిందని, మీటింగ్ జరిగిన విధానానికి నిరసనగా డిసెంబర్-27,2017 భారత్ ఓ లెటర్ రాసిందని తెలిపారు.

జాదవ్ కేసులో మంగళవారం(ఫిబ్రవరి-19,2019) పాక్ తన వాదనలు వినిపించనుంది. తిరిగి బుధవారం(ఫిబ్రవరి-20,2019)న భారత్ స్పందించాక, గురువారం(ఫిబ్రవరి-21,2019) పాక్ తుది వాదనలు వినిపించనుంది.పాక్‌ తరఫున బారిస్టర్‌ ఖావర్‌ ఖురేషి వాదనలు వినిపించనున్నారు.

భారత నావికాదళ మాజీ అధికారి అయిన కుల్ భూషణ్ జాదవ్ కు ఉగ్రవాదం,గూఢచర్యం ఆరోపణలతో 2017 ఏప్రిల్ లో పాక్ లోని మిలటరీ కోర్టు జాదవ్ కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై అదే ఏడాది మే-18న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది.

Read Also : గ్లోబల్ ట్రెండ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్

Read Also : ఇండియా ఎఫెక్ట్ : పాక్‌లో భగ్గుమన్న టీ ధరలు

Read Also : పాక్ కు మోడీ వార్నింగ్ : మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్