జైల్లో ఉండే దందాలు.. రూ.5కోట్లు ఇవ్వకపోతే

జైల్లో ఉండే దందాలు.. రూ.5కోట్లు ఇవ్వకపోతే

Updated On : July 27, 2020 / 4:59 PM IST

జితేంద్ర యోగి ఢిల్లీలోని ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్లలో ఒకరు. దేశ రాజధాని ఢిల్లీ హై సెక్యూరిటీ తీహార్ జైల్లో ఉండే దందాలు చేస్తున్నాడు. వార్నింగ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకపోతే అంతు చూస్తానంటూ వార్నింగ్ అందడంతో పోలీస్ కంప్లైంట్ అందింది. పోలీసు అధికారులు విచారణ జరపడంతో జైళ్లో నుంచే కాల్ వచ్చినట్లు తెలిసింది. రైడ్ చేసిన పోలీసులు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకుని సీజ్ చేశారు.

2019లోనే అరెస్ట్ అయిన గోగి ఇంకా దందాలు చేస్తూనే ఉన్నట్లు ఈ ఘటనతోనే బయటపడింది. జైల్లోని 8వ నెంబర్ లో ఉంటున్న జోగి డబ్బులు ఇవ్వాలని లేకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీనిపై పోలీసులు అతణ్ని విచారిస్తున్నారు.

అతణ్ని చంపిన వారికి రూ.4లక్షల రివార్డు కూడా ఉంది. హర్యానా ప్రభుత్వం కూడా రూ.2లక్షలు రివార్డు ప్రకటించింది. ఢిల్లీలోని నారెలాలో లోకల్ లీడర్ వీరేంద్ర మన్ ను చంపిన కేసులో గోగి అతని అనుచరులు నిందితులుగా ఉన్నారు. పట్టపగలే గోగి మన్ ను 26బుల్లెట్లు పేల్చి హత్య చేశాడు.