లాక్‌డౌన్ ఉల్లంఘించేవారికి పోలీసుల కొత్త శిక్షలు.. ‘Masakali 2.0’ వినాల్సిందే!

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. నిత్యావసరాలకు మినహా ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ ఇంటికి పరిమితమయ్యారు. కానీ, కొంతమంది ఆకతాయిలు లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ముందుగా పోలీసులు బుజ్జగించి చెప్పినా వినడం లేదు. కొట్టినా తిట్టినా మళ్లీ రోడ్లపైకి వచ్చేస్తునే ఉన్నారు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు వినూత్న రీతిలో శిక్షలు వేస్తున్నారు.
లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారికి కొత్త శిక్షలు అమలు చేస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో లాక్ డౌన్ ఉల్లంఘించే ఆకతాయిల తిక్క కుదుర్చుతున్నారు. ఉల్లంఘనకు పాల్పడేవారిని జైపూర్ పోలీసులు ట్విట్టర్ వేదికగా హెచ్చరిస్తున్నారు. ‘అవసరం లేకపోయినా మీరు రోడ్లపై తిరుగుతూ కనిపిస్తే.. మిమ్మల్ని ఒక రూంలో పెట్టి Masakali 2.0 పాటను లూప్‌లో ప్లే చేస్తాం’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
मत उडियो, तू डरियो
ना कर मनमानी, मनमानी
घर में ही रहियो
ना कर नादानीऐ मसक्कली, मसक्कली#StayAtHome #JaipurPolice #TanishkBagchi #Masakali2 #ARRahman @arrahman @juniorbachchan @sonamakapoor @RakeyshOmMehra pic.twitter.com/lYJzXvD8i4
— Jaipur Police (@jaipur_police) April 9, 2020
భూషణ్ కుమార్ కు చెందిన టి-సిరీస్‌లో ఈ పాట రీమిక్స్ ‘Masakali 2.0’గా కంపోజర్ తనీష్ బాగ్చితో ప్రారంభించారు. గాయకులు తులసి కుమార్, సాచెట్ టాండన్ పాడారు. సినిమా పాట అసలు వెర్షన్ పాడారు. సింగర్ మోహిత్ చౌహాన్, ఢిల్లీ 6 చెప్పారు. అక్కడ “Masakali” RECREATED వెర్షన్ ఏ పాయింట్ అది కూడా పోలికే లేదు. అసలు ట్రాక్‌ను ప్రసూన్ జోషి రచించారు. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ నటించిన 2009 చిత్రం కోసం AR రెహమాన్ స్వరపరిచారు.
Also Read | ఆపరేషన్ సక్సెస్, ఏడున్నర గంటల సర్జరీ తర్వాత పంజాబ్ పోలీస్ తెగిన చేతిని తిరిగి అతికించిన డాక్టర్లు