జమ్మూకాశ్మీర్ లో ప్రశాంతంగా మూడో ద‌శ పోలింగ్‌.. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 11.60 శాతం పోలింగ్ న‌మోదు

జమ్మూకశ్మీర్‌లో మూడో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైంది.

జమ్మూకాశ్మీర్ లో ప్రశాంతంగా మూడో ద‌శ పోలింగ్‌.. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 11.60 శాతం పోలింగ్ న‌మోదు

Jammu and Kashmir 2024 assembly election 11.60 percentage votes polled till 9 am

Updated On : October 1, 2024 / 10:48 AM IST

జమ్మూకశ్మీర్‌లో మూడో ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైంది. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో పోలింగ్ కొన‌సాగుతోంది. మొత్తం ఏడు జిల్లాల్లో 40 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జ‌రుగుతోంది.

415 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. 5,060 పోలింగ్‌ కేంద్రాల్లో 39.18 లక్ష‌ల మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. ఉద‌యం 9 గంట‌ల వ‌రకు 11.60 శాతం పోలింగ్ న‌మోదైంది.

మహిళను చెట్టుకు కట్టేసి.. సజీవ దహనం చేసిన కొడుకులు, కోడలు

జిల్లాల వారిగా పోలింగ్ శాతం వివరాలు
బందిపోర్ – 11.64 శాతం
బరాముల్లా – 8.89 శాతం
జమ్మూ -11.46 శాతం
కథువా -13.09 శాతం
కుప్వారా -11.27 శాతం
సాంబా – 13.31 శాతం
ఉధమ్ పూర్ -14.23 శాతం