విరిగిపడ్డ కొండచరియలు : జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారి క్లోజ్

శ్రీనగర్ : శ్రీనగర్ లో కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో రహదారులను అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. రాంబన్ జిల్లాలోని డింఘోల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో మంగళవారం (మే 7) ఉదయం నుంచి ఈ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ మార్గం నుంచి వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
కాగా గురువారం (మే 9) ఉదయం కూడా డింఘోల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో వాటిని క్రేన్ సహాయంతో పక్కకు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. 300 కిలోమీటర్ల మేర ఉన్న జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారి కశ్మీర్ వ్యాలీని కలుపుకుంటూ వెళ్లే ఈ మార్గంలో కొండచరియలు విరిగిపడుతుంటాయి
#Visuals: Jammu-Srinagar national highway closed due to landslide at Digdole in Ramban. #JammuAndKashmir pic.twitter.com/gM3UJo1BRo
— ANI (@ANI) May 9, 2019