జశ్వంత్ సింగ్ కన్నుమూత

Union minister Jaswant Singh :కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ (82) తుదిశ్వాస విడిచారు. 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం కన్నుమూశారు.
జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్ చేశారు.
ఆయన సేవలను కొనియాడుతూ ప్రధాని ట్వీట్ చేశారు. జశ్వంత్ సింగ్ ఎంతో శ్రద్ధతో దేశానికి సేవ చేశారని, సైనికుడిగా, రాజకీయ నేతగా రాణించారన్నారు. ఆర్థిక, రక్షణ రంగాల్లో తనదైన ముద్ర వేశాడన్నారు. బీజేపీ బలోపేతానికి ఆయన పని చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు మోడీ చెప్పారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలియచేశారు. దేశానికి సమర్థవంతంగా సేవ చేశారని చెప్పారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కేటాయించకపోవడంతో…బార్మర్ జిల్లా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కల్నల్ సోనారామ్ చేతిలో పరాజయం చెందారు. గత ఆరేళ్లుగా ఆయన కోమాలో ఉన్న సంగతి తెలిసిందే. 2014లో ఆయన నివాసంలో గాయపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో…ఢిల్లీలోని Army (Research and Referral) Hospital చికిత్స పొందారు.
వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రిగా, రక్షణ, విదేశాంగ మంత్రిగా పని చేశారు. 2009లో ఓ పుస్తకం రచించారు. అందులో మహ్మద్ ఆలీ జిన్నా గురించి వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో పార్టీ నుంచి బయటకు బహిష్కరించారు. తరువాత పార్టీలో చేర్చుకున్నారు.