జవాన్ల పదవీ విరమణ వయస్సు పెంపు ?

సైన్యంలో జవాన్ల పదవీ విరమణ వయస్సును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : February 9, 2019 / 04:17 PM IST
జవాన్ల పదవీ విరమణ వయస్సు పెంపు ?

సైన్యంలో జవాన్ల పదవీ విరమణ వయస్సును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఢిల్లీ : సైన్యంలో జవాన్ల పదవీ విరమణ వయస్సును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పదవీ విరమణ వయస్సును 40ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ఒక వేళ ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడితే విడతల వారీగా దీనిని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా మంది జవాన్లు 15-17ఏళ్లపాటు సేవలు అందించి 35-37ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తున్నారు. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే వీరు మరో మూడు నుంచి ఐదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను రక్షణశాఖ, కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఆ వయస్సులో జవాన్లకు ఉండే ఫిజికల్ ఫిట్ నెస్ పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. 

ఒక వేళ జవాన్ల పదవీవిరమణ వయస్సు పెంచితే .. ఆ నిర్ణయాన్ని దశల వారీగా అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొత్తగా జవాన్ల నియామకాల్ని ఆపివేయాల్సి వస్తుంది. కొత్త ప్రతిపాదన వల్ల పింఛన్ల బిల్లు , ఎక్స్‌సర్వీస్‌ మెన్లకు ఇచ్చే లబ్ధిల ఖర్చు కూడా తగ్గవచ్చు. దీని ప్రభావం కొత్త నియామకాలపై కూడా పడుతుంది. అంతేకాదు దళాలకు ఐదేళ్లపాటు శిక్షణ ఖర్చులు కూడా సైన్యానికి మిగులుతాయి.