ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు.. ‘జెట్ బ్లూ’ బంపర్ ఆఫర్

‘జెట్ బ్లూ’ అనే విమాన సంస్థ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్లి అకౌంట్లో ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేస్తారో వారు ఏడాదిలో ఎన్నిసార్లైనా విమానంలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
‘ఆల్ యు జెట్’ అనే కార్యక్రమంలో ఎంపికయ్యే లక్కీ విన్నర్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేయడమే కాదు. ఆ తర్వాత ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ కస్టమైజ్డ్ ఫొటోను మీ అకౌంట్లోకి షేర్ చేసుకోవాలి. ఆ ఫొటో షేర్ చేసేప్పుడు #AllYouCanJetSweepStakes అని రాయాలి.
ఫొటోలు డిలీట్ చేస్తున్నామని మీరు అస్సలు బాధపడకండి. ఈ బంపర్ ఆఫర్ సాధిస్తే.. మీరు ఎక్కడెక్కడికి ప్రయాణిస్తారో ఆ ఫొటోలను పోస్ట్ చేసుకోవచ్చని విమానయాన సంస్థ వెల్లడించింది. శుక్రవారం(మార్చ్ 8,2019)న ఈ పోటీ ముగిసింది. మార్చి 11న విజేతలను ప్రకటిస్తారు. ఈ పోటీలో విజయం సాధించిన వారు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు జెట్ బ్లూ విమానాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే, ఈ ఆఫర్ అమెరికా పౌరులకు మాత్రమే. వేరే దేశాలవారికి వర్తించదు.