Jharkhand Elections 2024 : ఝార్ఖండ్‌లో ముగిసిన ప్రచారం.. రేపే తొలివిడత ఎన్నికలు.. 43 స్థానాల్లో పోలింగ్.. పూర్తి వివరాలివే!

Jharkhand Assembly Election 2024 : నవంబర్ 13న తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. తొలి విడతలో భాగంగా 15 జిల్లాలోని 43 స్థానాలకు పోలింగ్ జరుగనుంది.

Jharkhand Elections 2024 : ఝార్ఖండ్‌లో ముగిసిన ప్రచారం.. రేపే తొలివిడత ఎన్నికలు.. 43 స్థానాల్లో పోలింగ్.. పూర్తి వివరాలివే!

Jharkhand Assembly Election 2024 _ Phase 1 voting on 13 November

Updated On : November 12, 2024 / 7:14 PM IST

Jharkhand Assembly Election 2024 : ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం ముగిసింది. తొలి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 81 స్థానాల్లోని 43 చోట్ల పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. తొలి విడతలో భాగంగా 15 జిల్లాలోని 43 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరగనుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. 200 కంపెనీల కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ జరుగనుంది.

మొదటి విడతలో మొత్తం 43 స్థానాలకు 685 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అందులో 17 జనరల్, 20 ఎస్టీ, 6 ఎస్సి రిజర్వేడ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 15 జిల్లాల్లో 15,344 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, గ్రామీణ ప్రాంతాల్లో 12716, పట్టణ ప్రాంతాల్లో 2628 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు.

950 పోలింగ్ స్టేషన్స్ లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. 1153 మహిళ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. మొదటి విడత ఎన్నికల్లో 179.14 కోట్ల విలువైన నగదు, అక్రమ సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద 54 కేసులు నమోదు చేశారు.

తొలి విడత బరిలో నిలిచింది ఎవరెవరంటే? :
మొదటి విడత పోలింగ్ బరిలో మాజీ సీఎం చంపై సొరేన్, ఆరోగ్య శాఖ మంత్రి బన్న గుప్తా, సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పన సొరేన్, మహావ మాజీ, మాజీ సీఎం మధు కోడా భార్య గీత కోడా, మాజీ ముఖ్యమంత్రి రఘుబార్ దాస్ కోడలు పూర్ణిమ దాస్ నిలిచారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో 5 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు, గిరిజన వ్యతిరేక విధానాలు, అక్రమ వలసలు అంశాలు లక్ష్యంగా బీజేపీ జోరుగా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించగా, విద్య, స్థానికత, సామాజిక న్యాయం, ఆహారభద్రత, మహిళ సంక్షేమం, ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమం వంటి 7 గ్యారెంటీలు ప్రధానంగా ఇండియా కూటమి ప్రచారాన్ని నిర్వహించింది.

ఝార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా, నవంబర్ 20న రెండో దశ పోలింగ్ జరగనుంది. రెండో దశలో 38 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడి కానున్నాయి.

Read Also : Reliance In AP : ఏపీలో రిలయన్స్ 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడి.. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే..