Jharkhand: 80మంది బాలికల షర్టులు విప్పించిన ప్రిన్సిపాల్.. ఆగ్రహంతో తల్లిదండ్రులు ఏం చేశారంటే..
Jharkhand: విద్యార్థునుల పట్ల ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకర రీతిలో ప్రవర్తించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

Jharkhand: principal asks 80 girls to remove shirts and parents complained to DC
Jharkhand: విద్యార్థునుల పట్ల ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకర రీతిలో ప్రవర్తించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపాల్ 10వ తరగతి చదువుతున్న 80మంది బాలికలను వారి షర్టులను తొలగించాలని ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ధన్‌బాద్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) మాధవి మిశ్రాకు ప్రిన్సిపాల్ పై విద్యార్థులను తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుతో కొంతమంది బాలికలతో, స్కూల్ సిబ్బందితోనూ మాట్లాడామని, ఈ ఘటనపై పూర్తిస్థాయి వివరాలతో నివేదిక ఇవ్వాలని నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని డీసీ తెలిపారు.
Also Read: Champions Trophy 2025: టీమిండియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జస్ర్పీత్ బుమ్రా ఔట్..?
తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. 10వ తరగతి విద్యార్థినులు వారి పరీక్షలు పూర్తయిన తరువాత ‘పెన్ డే’ సందర్భంగా ఒకరి చొక్కాలపై మరొకరు వీడ్కోలు సందేశాలు రాసుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రిన్సిపాల్ విద్యార్థునులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వారు క్షమాపణలు చెప్పారు. అయినా ప్రిన్సిపాల్ వారి షర్టులను విప్పించాడు. బ్లేజర్లతోనే విద్యార్థినులను ఇంటికి పంపారు. ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ తో కలిసి డీసీ మాధవి మిశ్రాను కలిసి విషయాన్ని తెలియజేశారు. ప్రిన్సిపాల్ ప్రవర్తన ఆ అమ్మాయిల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.. ఇది సిగ్గుచేటు.. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాగిణి సింగ్ డీసీని కోరారు.
Also Read: Maharashtra: పండుగ వేళ విషాదం.. తండ్రీకొడుకు ప్రాణాలు తీసిన స్మార్ట్ ఫోన్..
విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన డీసీ మాధవి మిశ్రా.. కొంత మంది విద్యార్థినులతోనూ, పాఠశాల సిబ్బందితోనూ మాట్లాడారు. ఈ ఘటనపై నలుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించారు. ఇందులో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, డీఈఓ, సాంఘీక సంక్షేమ అధికారి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఉన్నారు. వీరి నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకుంటామని విద్యార్థునుల తల్లిదండ్రులకు డీసీ సూచించారు. ఇదిలాఉంటే తనపై వచ్చిన ఆరోపణల గురించి ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ స్పందించలేదు.