Champions Trophy 2025: టీమిండియాకు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జస్ర్పీత్ బుమ్రా ఔట్..?
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.

Jasprit Bumrah likely to miss the group stages of Champions Trophy 2025
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. టోర్నీకి సంబంధించి గత నెలలోనే షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, భారత్ తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ తో ఆడనుంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన జరగనుంది. గ్రూప్ దశలో ఇండియా మొత్తం మూడు జట్లతో మ్యాచ్ లు ఆడనుంది. అయితే, బీసీసీఐ ఈ మెగా టోర్నీకి జట్టును ప్రకటించేందుకు సిద్ధమవుతుంది.
Also Read: IND vs ENG T20: ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లకు భారత్ జట్టు ప్రకటన.. షమీ, నితీశ్ రెడ్డితో సహా..
జనవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 15మందితోపాటు ట్రావెల్ రిజర్వ్ గా ముగ్గురిని ఎంపిక చేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తుంది. అయితే, అందుకు ఐసీసీ అనుమతి తప్పనిసరి. ఇదిలాఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా ఈ సిరీస్ కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తుంది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు బుమ్రా అందుబాటులో అండకపోవచ్చు. అతను వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తుంది.
Also Read: IND vs ENG : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. కేఎల్ రాహుల్ ఎంపిక పై బీసీసీఐ యూటర్న్..
బీసీసీఐకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోపీకి పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు బుమ్రా ఎన్సీఏకు వెళ్లాడు. ప్రాథమిక నివేదికలో అతనికి ఫ్రాక్చర్ కాలేదు. కానీ, అతను వెన్ను భాగంలో వాపు ఉంది. దీంతో ఎన్సీఏ పర్యవేక్షణలో అతను త్వరలోనే కోలుకుంటాడు. పూర్తిస్థాయిలో కోలుకున్న తరువాత బుమ్రా తన ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కారణంగా 15మంది టీం సభ్యుల జాబితాలో బుమ్రా పేరును చేర్చాలా.. అతని స్థానంలో యూఏఈకి మరొకరిని ఎంపిక చేయాలనే విషయంపై బోర్డు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోపీకి వెళ్లే పదిహేను మంది జట్టు సభ్యుల్లో జస్ర్పీత్ బుమ్రా పేరు ఉన్నప్పటికీ అతను గ్రూప్ దశలో మ్యాచ్ లు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.
Also Read: Arshdeep Singh : అర్ష్‌దీప్ సింగ్ స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన ధోని శిష్యుడు..
ఆస్ట్రేలియా వేదికగా జరగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో జస్ర్పీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ చేశాడు. అయితే, ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వెన్ను నొప్పితో అతను బౌలింగ్ కు దూరమయ్యాడు. ఈసిరీస్ బుమ్రా మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్ లో తొలి టెస్టుకు బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.
బుమ్రా ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా అతను వెన్ను నొప్పితో బాధపడుతూ కొన్ని రోజులు భారత్ జట్టుకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స తరువాత అతను సెప్టెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 వరకు దాదాపు 11 నెలలు క్రికెట్ కు దూరమయ్యాడు. ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో తిరిగి టీమిండియా జట్టులోకి బుమ్రా పునరాగమనం చేశాడు. బుమ్రా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యూఐఏకు వెళ్లే 15మంది భారత ఆటగాళ్లలో బుమ్రా లేకపోతే జట్టుకు ఇబ్బందికరమైన విషయమనే చెప్పొచ్చు. అయితే, బుమ్రా విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు బుమ్రాను కూడా ఎంపిక చేస్తుందా.. అతని స్థానంలో వేరే ఆటగాడికి అవకాశం ఇస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
🚨 NO BUMRAH FOR INDIA IN CT. 🚨
– Jasprit Bumrah likely to miss the group stages of the 2025 Champions Trophy due to back swelling. (Express Sports). pic.twitter.com/anVmanCp4a
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025